Abn logo
Apr 28 2021 @ 00:00AM

సాఫ్ట్‌వేర్‌ సత్యభామ

‘మొదట మిమ్మల్ని చూసి చాలా సీరియస్‌ అనుకున్నాను. కానీ ఎంతో కూల్‌గా ఉన్నారు’ అంటాడు హరీష్‌. ‘అవును... పోను పోను నువ్వే తెలుసుకొంటావ్‌’ అంటుంది టీఎల్‌. ‘ఇంతక ముందు మీరు ఎక్కడ పనిచేశారు’... అని అడగ్గానే ‘ఒక అమ్మాయిని అడగడానికి ఇంతకంటే మంచి క్వశ్చన్‌ దొరకలేదా నీకు’ అంటూ సిగ్గు నటిస్తుంది తను. ‘నీకు... సారీ సారీ... మీకు’ అని ఏదో చెప్పబోతాడు అతడు. ‘పర్లేదులే... నువ్వు అనచ్చు. నాకు నీ మీద రెస్పెక్ట్‌ ఎప్పుడో పోయిందిలే’ అన్న ఆమె మాటలకు మనోడికి ఎక్కడో తగులుతుంది.


కొత్తగా వస్తున్న టీమ్‌ లీడర్‌ ఎవరా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగులు. వచ్చేది అమ్మాయని తెలిసి హరీష్‌ తెగ సంబరపడిపోతుంటాడు. ఇంతలో ఆ టీఎల్‌... అదే టీమ్‌ లీడర్‌ ఎంటరవుతుంది. రాగానే ఉద్యోగులు విష్‌ చేస్తే... ‘ఈ ఫార్మాలిటీస్‌ అన్నీ అవసరం లేదు. పని చేసుకుపోతుంటే ఇంట్రడక్షన్‌ అదే అవుతుంది’ అంటుంది టీఎల్‌ సత్యభామ. దాంతో అంతా అప్‌సెట్‌ అవుతారు. ‘అందముంది కదా... ఆ మాత్రం పొగరుంటుంది’ అంటూ సర్దుకుపోతాడు హరీష్‌. మీటింగ్‌ మొదలై... అయిపోతుంది. కానీ మనోడు టీఎల్‌ వంక తదేకంగా చూస్తూనే ఉంటాడు. ‘హలో మిస్టర్‌... మీటింగ్‌ అయిపోయింది’... అంటూ విసుక్కుంటుంది అతడి చూపులు గమనించిన టీఎల్‌. ‘మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అప్పుడే మీటింగ్‌ అయిపోయిందా అనిపిస్తుంది’ అంటాడు అతడు. ‘అవునా..! కమ్‌ టూ మై కేబిన్‌’... ఆర్డర్‌ వేస్తుంది తను.


అతడు ఏదో ఊహించేసుకొని కేబిన్‌లోకి వెళతాడు. ‘హాయ్‌... కూర్చో’. ‘మొదట మిమ్మల్ని చూసి చాలా సీరియస్‌ అనుకున్నాను. కానీ చాలా కూల్‌గా ఉన్నారు’ అంటాడు హరీష్‌. ‘అవును... పోను పోను నువ్వే తెలుసుకొంటావ్‌’ అంటుంది టీఎల్‌. ‘ఇంతక ముందు మీరు ఎక్కడ పనిచేశారు’... అని అడగ్గానే ‘ఒక అమ్మాయిని అడగడానికి ఇంతకంటే మంచి క్వశ్చన్‌ దొరకలేదా నీకు’ అంటూ సిగ్గు నటిస్తుంది తను. ‘నీకు... సారీ సారీ... మీకు’ అని ఏదో చెప్పబోతాడు అతడు. ‘పర్లేదులే... నువ్వు అనచ్చు. నాకు నీ మీద రెస్పెక్ట్‌ ఎప్పుడో పోయిందిలే’ అన్న ఆమె మాటలకు మనోడికి ఎక్కడో తగులుతుంది. ఆఫీస్‌, టీమ్‌ గురించి చెప్పమని టీఎల్‌ అడిగితే... తనకు ఆఫీస్‌ గానీ, ఇక్కడి టీమ్‌ గానీ నచ్చవంటాడు. మంచి జీతం వస్తే వేరే కంపెనీకి జంప్‌ చేస్తానంటాడు. తను ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతుంది. తరువాతి రోజు టీఎల్‌ కేబిన్‌లోకి వెళ్లి... డేట్‌కు వస్తారా అని అడుగుతాడు హరీష్‌. తను ఓకే అంటుంది.ఆ విషయం ఆఫీసంతా చెబుతాడు అతడు. ‘ఏదో తేడా కొడుతుందే’ అంటుంది సహోద్యోగి. తెల్లారుతుంది. టీఎల్‌, హరీష్‌. ఓ హోటల్‌లో కలుస్తారు. ‘ఈ రోజు నాకు చాలా స్పెషల్‌’ అంటాడు హరీష్‌. ‘ఏమిటా స్పెషల్‌’ అడుగుతుంది తను. ఇంతలో మరో అమ్మాయి... ‘ఇఫ్‌ యూ డోన్ట్‌ మైండ్‌... కెన్‌ ఐ సిట్‌ హియర్‌’ అంటూ సీరియస్‌ ఫేస్‌తో వచ్చి వారి మధ్యలో కూర్చొంటుంది. ఆమెను చూడగానే హరీష్‌ షాకవుతాడు. ‘ఆఫీస్‌ మీటింగ్‌ నడుస్తుంది. కాసేపు ఆగి వచ్చి కూర్చో’ అంటాడు కోపంగా అతడు. దానికి అంతే కోపంగా ‘ఇప్పుడే కూర్చుంటా’ అంటుంది ఆ అమ్మాయి. ‘ఏం జరుగుతుంది హరీష్‌... మాట్లాడు’ అంటుంది చికాగ్గా టీఎల్‌. ‘యాక్చువల్లీ షీ ఈజ్‌ మై గర్ల్‌ఫ్రెండ్‌’ అంటాడు. ‘తెలుసు’ అని టీఎల్‌ చెప్పగానే హరీష్‌ షాకవుతాడు. ‘ఆల్రెడీ గర్ల్‌ఫ్రెండ్‌ ఉండి నన్ను ఎంత దారుణంగా ఫ్లర్ట్‌ చేశావో తెలుసా నువ్వు. పాపం రమ్య... నీకు అలానే పడిపోయుంటుంది. అయినా నేను ఇంత దూరం వచ్చింది నీకేదో క్లాస్‌ పీకడానికి కాదు. అదెలాంటి వాడిని లవ్‌ చేసిందో అర్థమయ్యేలా తనకు చెబుదామని. గుడ్‌బై’ అనేసి వెళ్లిపోతుంది టీఎల్‌.‘నన్ను చీట్‌ చేశావని నీకు కొంచెం కూడా సిగ్గ నిపించడంలేదా’ అడుగుతుంది రమ్య. తరువాత హరీష్‌ పరిస్థితి ఏమిటన్నది ‘సాఫ్ట్‌వేర్‌ సత్యభామ’ లఘు చిత్రంలో చూడాల్సిందే. ‘తమడ మీడియా’ రూపొందించిన ఈ షార్ట్‌ ఫిలిమ్‌కు యూట్యూబ్‌లో ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

ప్రత్యేకం మరిన్ని...