Friendsతో పార్టీకెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. పూర్తయ్యాక Parking దగ్గరికొచ్చి చూసేసరికి షాకింగ్..!

ABN , First Publish Date - 2021-11-09T16:52:06+05:30 IST

ఓ హోటల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ స్నేహితులతో కలిసి పార్టీకి హాజరయ్యాడు. పార్టీ ముగిసిన...

Friendsతో పార్టీకెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. పూర్తయ్యాక Parking దగ్గరికొచ్చి చూసేసరికి షాకింగ్..!

  • మత్తులో ఒక కారుకు బదులుగా మరొకటి
  • దొంగలుగా భావించి ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ : గచ్చిబౌలి పరిధిలోని ఓ హోటల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ స్నేహితులతో కలిసి పార్టీకి హాజరయ్యాడు. పార్టీ ముగిసిన తర్వాత శనివారం అర్ధరాత్రి వ్యాలెట్‌ పార్కింగ్‌లో కారు కనిపించలేదు. సిబ్బందిని అడుగగా.. స్నేహితుని కారు అంటూ ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు చెప్పారు. కారు బాధితుడి మొబైల్‌ కారులోనే ఉండిపోవడంతో దాని జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా కారు బంజారాహిల్స్‌కు వెళ్లినట్లు గుర్తించాడు. ఆదివారం ఉదయం డయల్‌ 100కు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్‌ పోలీసులు కారుతో సహా.. ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. గచ్చిబౌలిలో చోరీ జరగడంతో కేసు గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. తాగిన మత్తులో ఉన్న నిందితులు తన కారుకు బదులుగా వేరే కారును తీసుకెళ్లినట్లుగా తేల్చారు. కారు తీసుకెళ్లిన వ్యక్తి ఇంట్లో మూడు కార్లు ఉండటంతో ఏ కారు తెచ్చాడో అర్థం కాక.. తన కారే అనుకొని మరో వ్యక్తి కారును తీసుకెళ్లాడని, వారు దొంగలు కాదని, వారికి ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరులు, నిందితులు ఎవరి కార్లు వారు తీసుకొని వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-09T16:52:06+05:30 IST