Software ఉద్యోగం పోగొట్టుకొని కూరగాయల విక్రేతగా.. ఫేస్‌బుక్‌లో యువకుడితో అమ్మాయిగా పరిచయం.. పెళ్లి చేసుకుందామని ముగ్గులోకి దింపి.. భార్య అకౌంట్ నంబరిచ్చి.. ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు..!

ABN , First Publish Date - 2021-11-24T14:41:34+05:30 IST

Software ఉద్యోగం పోగొట్టుకొని కూరగాయల విక్రేతగా.. ఫేస్‌బుక్‌లో యువకుడితో అమ్మాయిగా పరిచయం.. పెళ్లి చేసుకుందామని ముగ్గులోకి దింపి.. భార్య అకౌంట్ నంబరిచ్చి.. ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు..!

Software ఉద్యోగం పోగొట్టుకొని కూరగాయల విక్రేతగా.. ఫేస్‌బుక్‌లో యువకుడితో అమ్మాయిగా పరిచయం.. పెళ్లి చేసుకుందామని ముగ్గులోకి దింపి.. భార్య అకౌంట్ నంబరిచ్చి.. ట్విస్ట్‌లే.. ట్విస్ట్‌లు..!

  • చదివింది ఐటీ.. రూ. కోటికి టోపి
  • ఆన్‌లైన్‌ రమ్మీ.. క్రికెట్‌ బెట్టింగ్‌కు బానిస
  • మోసాల బాట పట్టిన టెక్కీ
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోగొట్టుకొని 
  • కూరగాయల విక్రేతగా.. 
  • ఫేక్‌ ఫేస్‌బుక్‌ ఖాతాతో బురిడీ.. అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : ఉన్నత విద్యావంతుడు.. మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. కానీ, ఓ వ్యసనం అతడి జీవితాన్ని నేరాల బాట పట్టించింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాతో ప్రేమ, పెళ్లి అంటూ రూ. కోటి దోచుకున్న నిందితుడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన యెర్రగుడ్ల దాసు(30) నూజివీడు త్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ చదివాడు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని టీసీఎస్‌లో 2014లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాడు. అతడికి ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడే వ్యసనం ఉంది. దీంతో సరిగా విధులకు హాజరుకాకపోవడంతో, సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఐదేళ్ల క్రితం గుంటూరు జిల్లాకే చెందిన జ్యోతిని వివాహం చేసుకుని, స్వగ్రామంలో కొంత భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. పెద్దగా కలిసి రాకపోవడంతో సత్తెనపల్లిలో పండ్లు, కూరగాయల వ్యాపారం చేశారు.


వచ్చిన డబ్బులను ఆన్‌లైన్‌ రమ్మీ ఆటలో పెట్టి, పోగొట్టుకున్నాడు. 2019లో ఆన్‌లైన్‌ రమ్మీ బ్యాన్‌ కావడంతో క్రికెట్‌ బెట్టింగ్‌ల వైపు దృష్టి మరల్చాడు. అందులో కూడా తీవ్రంగా నష్టపోయాడు. చదువుతున్న సమయంలోనే కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. అమ్మాయిగా నమ్మిస్తూ ఫేస్‌బుక్‌లో స్నేహితులతోపాటు తెలియని వారికి ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పంపుతూ బురిడీ కొట్టించేవాడు. రెండేళ్ల క్రితం నగరానికి చెందిన చింతల విజయ్‌రెడ్డికి కూడా సదరు ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. తనను అమ్మాయి(కల్యాణిశ్రీ)గా పరిచయం చేసుకున్న దాసు చాటింగ్‌ చేసేవాడు. పెళ్లి చేసుకుందామని విజయ్‌రెడ్డిని ముగ్గులోకి లాగాడు. తల్లిదండ్రుల ద్వారా తనకు దక్కాల్సిన విలువైన వ్యవసాయ భూమి వివాదంలో ఉందని, వివాదం సెటిల్‌ కావాలంటే రూ. కోటికి అవసరమని, డబ్బులు సర్దితే భూమి విక్రయించి ఇస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని విజయ్‌రెడ్డిని నమ్మించాడు.


దీంతో విజయ్‌రెడ్డి పలు విడుతలుగా దాసు(కల్యాణిశ్రీ) భార్య జ్యోతికి చెందిన బ్యాంకు అకౌంట్‌కు రూ. కోటి వరకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ రావడం, ఫేస్‌బుక్‌ ఖాతా కూడా బ్లాక్‌ చేసినట్లు కనిపించడంతో అనుమానం వచ్చిన విజయ్‌రెడ్డి ఇటీవల సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు దాసుతోపాటు అతని భార్య జ్యోతిని సత్తెనపల్లిలో అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు మంగళవారం  రిమాండ్‌కు తరలించారు. ఆ డబ్బులతో దాసు దంపతులు కొంత వ్యవసాయ భూమి, నగలు కొనుగోలు చేశారని, క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టాడని, మిగితా డబ్బులతో జల్సాలు చేశారని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-11-24T14:41:34+05:30 IST