Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమాజంలో ప్రశ్నించే గొంతుకలు కావాలి

- తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం
లక్షెట్టిపేటరూరల్‌, నవంబరు 28: సమాజంలో జరుగుతున్న అణచివేతలపై ప్రశ్నించే గొంతుకలు కావాలని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం సాహితి స్రవంతి లక్షెట్టిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన కరిపె రాజ్‌కుమార్‌ రచించిన స్వేచ్ఛాగానం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కవులు, రచయితలు సామాజికంగా జరుగుతున్న వివక్షతలపై అసమానతల అణిచివేతపై తమ రచనల్లో బాణాలు ఎక్కు పెట్టాలని సూచించారు. ఉద్యమాలతోనే సాహిత్యం ఉంటుందని చెప్పారు. సాహిత్యంతోనే ఉద్యమాలు బలపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గోపగాని రవీందర్‌, నీలాదేవి, రాజేశ్వర్‌రావు, వేదిక ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, కవులు, రచయితలు కందుల తిరుపతి, గఫార్‌, రవీంద్ర, జనార్ధన్‌, సుబ్బాయమ్మ, భారతి, రమణ, వినయ్‌కుమార్‌, నాగవర్మ, అల్లాడి శ్రీనివాస్‌, రాజసమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement