‘చేతన’ సేవామార్గం{ పేదలను ఆదుకుంటున్న ఫౌండేషన్‌

ABN , First Publish Date - 2021-01-25T04:26:20+05:30 IST

సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి తోడుపడవోయ్‌ అన్న గురజాడ మాటలను వంటపట్టించుకున్నారు

‘చేతన’ సేవామార్గం{ పేదలను ఆదుకుంటున్న ఫౌండేషన్‌
డిజిటల్‌ టీవిలను పంపిణీ చేస్తున్న ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు

 సామాజిక సేవలో రవికుమార్‌

 వలంటీర్ల ద్వారా చేయూత

బోనకల్‌, జనవరి 24: సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి తోడుపడవోయ్‌ అన్న గురజాడ మాటలను వంటపట్టించుకున్నారు సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి తోడుపడవోయ్‌ అన్న గురజాడ మాటలను వంటపట్టించుకున్నారు ఆయన. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం వలన పలు కష్టాలను అనుభవించి ఉన్నత స్థాయి ఉద్యోగంలో స్థిరపడినా ఆలోచనల వేగం మాత్రం సేవాబాటను వీడలేదు. తన పని తాను చేసుకొని హాయిగా కుటుంబంతో గుడుపుతూ ఆస్తులను పెంచుకుంటున్న ఈ రోజుల్లో కొందరూ మాత్రం నిస్వార్ధంగా నలుగురికి సహాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి తామున్నామని గుర్తు చేస్తుంటారు. అందులో ఒకరు చేతన ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వెనిగళ్ల రవికుమార్‌. 2016లో ఫౌండేషన్‌ను స్థాపించి అమెరికా, ఇండియాలోని పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా గుత్తవారిపాలెం ఆయన స్వగ్రామమైనా పెరిగింది మాత్రం మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కొత్తపేట గ్రామం కావడంతో జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఆయన 2000లో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. ఒరెగాన్‌ రాష్ట్రం పోర్ట్లాండ్‌ నగరంలో స్థిరపడ్డారు. భార్య రేణుక, కొందరు మిత్రుల సహకారంతో చేతన ఫౌండేషన్‌ను స్థాపించారు. అమెరికా, ఉగాండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చెన్నై, ముంభై, కేరళ తదితర ప్రాంతాలలో విస్తృతంగా సామాజిక సేవలందిస్తున్నారు. 25 మంది సభ్యులు, 100 మంది వాలంటీర్ల ద్వార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాము సంపాదించిన దానిలో కొంతైనా తిరిగి సమాజానికి ఇవ్వాలన్న దోరణితో ముందుకు సాగుతున్న చేతన ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రవి కుమార్‌, సభ్యులను ఆదర్శప్రాయంగా చెప్పవచ్చు. ఉన్నతస్థాయిలో స్థిరపడ్డ ప్రతి ఒక్కరు తమ ఆలోచనలను ఇదే రీతిలో మార్చుకుంటే సమాజాభివృద్ధిలో తాము బాగస్వామ్యులమని దీమాగా చెప్పుకోవచ్చు.


Updated Date - 2021-01-25T04:26:20+05:30 IST