Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు వెలుగులోకి తెద్దాం

 టీడీపీ ‘సెంట్రల్‌’ సోషల్‌ మీడియా వింగ్‌ సమావేశంలో బొండా సిద్ధార్థ

అజిత్‌సింగ్‌నగర్‌, డిసెంబరు 5: వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన, అవినీతి, అరాచకాలను సోషల్‌ మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చేలా పసుపు సైన్యం ముందుకు కదలాలని టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ నేత బొండా సిద్ధార్థ పిలుపునిచ్చారు. టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ సోషల్‌ మీడియా వింగ్‌ సమావేశం అజిత్‌సింగ్‌నగర్‌ పార్టీ కార్యాలయంలో సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి కోలా దుర్గారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ మాట్లాడారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని అసత్య, దుర్మార్గపు ప్రచారాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని, నీతి, నిజాయితీలే లక్ష్యంగా వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీకి చరమగీతం పాడాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, చంద్రన్న అధికారంలోకి రాగానే చేపట్టబోయే కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. నవనీతం సాంబశివరావు, బుగత రవితేజ, సాయి, శ్రీను, చైతన్య పాల్గొన్నారు.


Advertisement
Advertisement