వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు సోషల్ మీడియాకు కూడా సమయం కేటాయిస్తున్నారు. తమ వ్యక్తిగత, వృత్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.
* సహనంతో ఎదురు చూసే వారికి మాత్రమే మంచి జరుగుతుందంటూ ప్రముఖ కథానాయిక సమంత తన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
*ఏడు కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత అందమైన దృశ్యం కనిపించిందంటూ యువ హీరో నిఖిల్ ఓ ఫొటోను పంచుకున్నాడు.
*`జస్ట్ ఫర్ యూ` అంటూ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
*బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కత్రినా కైఫ్ జిమ్లో వర్కవుట్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది.
*బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సారా అలీఖాన్ తన ఫొటోలను షేర్ చేసింది.
*తన సినిమా షూటింగ్ మొదలైందంటూ హీరోయిన్ అవికా గోర్ తన ఫొటోను పోస్ట్ చేసింది.