వీసాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: ఇండియన్ ఎంబసీ

ABN , First Publish Date - 2021-03-07T21:33:01+05:30 IST

ఖతర్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. వీసాల విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖతర్ ప్రభుత్వం భారతీ

వీసాలపై ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: ఇండియన్ ఎంబసీ

దోహ: ఖతర్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. వీసాల విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖతర్ ప్రభుత్వం భారతీయులకు వీసా ఆన్ ఎరైవల్, విజిట్ వీసాలను జారీ చేస్తోందనే పోస్టులు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఖతర్‌లోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా స్పందించింది. వీసాల విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను కొట్టిపారేసింది. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఖతర్.. వీసాలను జారీ చేయడం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రకటలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది. అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించి.. ఖతర్ అధికారులో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొంది.


Updated Date - 2021-03-07T21:33:01+05:30 IST