ఆఫ్ఘన్ చిన్నారిని ఎత్తుకున్న ఈ american soldier.. చనిపోయిన తరువాత కూడా వైరల్ అవుతున్న ఆమె పోస్ట్

ABN , First Publish Date - 2021-08-31T10:44:08+05:30 IST

పై ఫోటో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో వేరే చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఓ అమెరికన్ మరీన్ సోల్జర్ ఆమె. ఆఫ్ఘన్‌కు చెందిన ఓ కుటుంబాన్ని..

ఆఫ్ఘన్ చిన్నారిని ఎత్తుకున్న ఈ american soldier.. చనిపోయిన తరువాత కూడా వైరల్ అవుతున్న ఆమె పోస్ట్

వాషింగ్టన్: పై ఫోటో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో వేరే చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఓ అమెరికన్ మరీన్ సోల్జర్ ఆమె. ఆఫ్ఘన్‌కు చెందిన ఓ కుటుంబాన్ని తరలించే క్రమంలోనే వారి చిన్నారిని ఇలా తన చేతుల్లోకి తీసుకుంది. ఈ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ తర్వాత అదే ఎయిర్‌పోర్ట్ వద్ద టెర్రరిస్టులు జరిపిన బాంబు దాడిలో ఆమె మరణించింది. ఆమెతో పాటు మరో 12 మందితో కలిపి మొత్తం 13 మంది గురువారం జరిగిన బాంబు దాడిలో మరణించారు. దాదాపు 160 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు.


తాజాగా ఆ బాంబు దాడిలో మరణించిన  వారి వివరాలను అమెరికా విడుదల చేసింది. అందులో పాపను ఎత్తుకున్న మరీన్ సోల్జర్ పేరు నికోల్ గీ అని, ఆమె వయసు 23 సంవత్సరాలని పేర్కొంది. ఆమె చనిపోవడానికి వారం ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఓ పాపను ఎత్తుకున్న ఫోటోను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు ఈ ఉద్యోగం ఎంతో ఇష్టమని ఆ పోస్ట్‌‌లో పేర్కొంది. అయితే సరిగ్గా వారంలో తీవ్రవాద ముఠా ఐఎస్ చేసిన బాంబు దాడిలో మరణించించింది. కాలిఫోర్నియాలోని సక్రామెంటో ప్రాంతంలో గీ నివశిస్తుండేది. నార్త్ కరోలినాలో లిజూన్ క్యాంప్‌లోని 24వ మరీన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌లో మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా ఆమె పనిచేస్తోంది.


ఇక ఆమెతో పాటు 12 మంది యూఎస్ మరీన్ ఆఫీసర్లు కూడా మరణించారు. వారిలో 20 ఏళ్ల రైలీ మెక్ కల్లమ్‌, 20 ఏళ్ల కరీం మెయిలీ గ్రాంట్ నికోవూ, 22 ఏళ్ల మాక్స్‌టన్ సోవియాక్, 22 ఏళ్ల హంబెర్టో శాన్‌చెజ్, 20 ఏళ్ల డైలన్ మెరోలా, 20 ఏళ్ల జారెడ్ స్క్‌మిట్జ్, 31 ఏళ్ల టైలర్ హూవర్, 23 ఏళ్ల డీగన్ విలియమ్-టైలర్ పేజ్, 25 ఏళ్ల జోహన్నీ రోసారియో పిచార్డో, 23 ఏళ్ల ర్యాన్ నాస్, 22 ఏళ్ల హంటర్ లోపెజ్, 20 ఏళ్ల డేవిడ్ లీ ఎస్పినోజాలు ఉన్నారు.

Updated Date - 2021-08-31T10:44:08+05:30 IST