సోషల్‌ ఇంజినీరింగ్‌ గ్రూపుల బాగోతం గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-09-14T04:33:50+05:30 IST

సోషల్‌ ఇంజినీరింగ్‌ గ్రూపుల బాగోతం గుట్టు రట్టు

సోషల్‌ ఇంజినీరింగ్‌ గ్రూపుల బాగోతం గుట్టు రట్టు

సోషల్ మీడియా వేదికగా అమాయకులను అడ్డంగా బుక్‌ చేస్తున్నాయి సోషల్‌ ఇంజినీరింగ్‌ గ్రూపులు. వాళ్లంతా ఒక గ్యాంగ్‌గా ఏర్పడి స్నేహం ముసుగులో అడ్డదారుల్లో డబ్బులు గుంజుతున్నారు. ఈ సోషల్‌ ఇంజనీరింగ్‌ గ్రూపుల బ్లాక్‌మెయిలింగ్‌ బాగోతం తెలుసుకున్న ఏబీఎన్‌ క్రైమ్‌ బ్యూరో నిఘా టీమ్‌ రంగంలోకి దిగింది. సైబరాబాద్‌ ఎస్‌వోటి పోలీసుల సహకారంతో గుట్టు రట్టు చేసింది. 


సోషల్ ఇంజినీరింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్...మీకు తెలియకుండా మీ డేటాని చోరీ చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం... మీతో స్నేహంగా నటించి మీ బలహీనతలు తెలుసుకొని డబ్బులు గుంజడమే సోషల్‌ ఇంజినీరింగ్‌ గ్యాంగ్‌లు చేసే పని. ఇలా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోషల్‌ ఇంజనీరింగ్‌ గ్యాంగ్‌కు చిక్కి మోసపోయాడు. తనకు జరిగిన మోసాన్ని ఏబీఎన్‌ క్రైమ్ బ్యూరో నిఘా టీమ్‌కు తెలపడంతో ఈ  బ్లాక్‌మెయిలర్స్‌ వ్యవహారం గుట్టు రట్టయింది .


రాజు .. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నతస్థానంలో పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో ఒంటరిగా ఉంటున్నాడు. ఖాళీ సమయంలో లైఫ్‌ స్ట్రీమింగ్‌ స్ట్రీమ్ కర్‌ యాప్‌లో చాటింగ్ చేసేవాడు. అక్కడే ఒక అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం.. వీడియో కాల్స్‌ చేసుకునే వరకు వెళ్లింది. తాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నానని... తనకు ఇద్దరు పిల్లలు అని చెప్పి మాట మాట కలిపింది ఒగలాడి. అవసరానికి డబ్బులు కావాలంటూ దాదాపు 5 లక్షల వరకు వసూలు చేసింది.. పెళ్లి కూడా చేసుకుంటానంటూ చెప్పడంతో బాధితుడు నమ్మాడు. బాధితుడ్ని నమ్మించేందుకు   ఆ యువతి వీడియో కాల్ కూడా చేసింది...


బాధితుడు రాజు ఆలస్యంగా విషయాన్ని తెలుసుకొని బ్యాంక్‌కు సమాచారం అందించి కార్డులను బ్లాక్ చేయించాడు. తాను ఫాంహౌస్‌లో ఉన్న సమయంలో మత్తు మందు ఇచ్చి క్రెడిట్‌ కార్డును వాడినట్లు తెలియడంతో బాధితుడు.... శ్రీధర్‌సాగర్‌ను నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఫిర్యాదును పట్టించుకోలేదు. అప్పటి వరకు తనతో ఉన్న శ్రీధర్ సాగర్ కనిపించకుండా పోయాడు.. కనీసం ఫోన్‌ కాల్స్‌ కూడా రిప్లయ్ ఇవ్వలేదు.  దీంతో బాధితుడు రాజు ఏబీఎన్‌ క్రైమ్ బ్యూరో నిఘా టీమ్‌కు సమాచారం ఇచ్చాడు. 



బాధితుడు తనకు మందు తాగే అలవాటు ఉంది కానీ.. ఆ రోజు డ్రగ్స్ తీసుకున్నట్టు అనిపించిందని చెప్పడంతో ఏబీఎన్‌ క్రైమ్‌ నిఘా టీమ్‌ శ్రీధర్‌ను ఫాలో అయింది. తాను డ్రగ్స్ కూడా అమ్ముతానని.. చాలా స్కెమ్స్‌ తెలుసని చెప్పాడు. డ్రగ్స్‌ కావాలి.. 40 లక్షలు మా దగ్గర ఉన్నాయ్‌.. అనగానే రెండు రోజుల సమయం తీసుకొని తన దగ్గర రెండు కిలోల డ్రగ్స్‌ ఉన్నాయని  చెప్పాడు.


ఎప్పుడైతే డ్రగ్స్ విషయంలో అనుమానాస్పదంగా మాట్లాడుతున్నాడో అప్పుడు సామాజిక బాధ్యతతో విషయాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర దృష్టికి తీసుకెళ్లింది ఏబీఎన్‌ క్రైమ్ టీమ్. సీపీ ఆదేశాలతో సైబర్‌క్రైమ్‌ డీసీపీ రోహిణి ఎస్‌వోటి టీమ్‌ను ఏర్పాటు చేశారు.  శ్రీధర్‌సాగర్‌ చెప్పిన విధంగా రాయచూర్ వెళ్లారు. 


సైబరాబాద్ ఎస్‌వోటి టీమ్‌తో కలిసి ఏబీఎన్‌ క్రైమ్ బ్యూరో నిఘా టీం ఆపరేషన్ మొదలు పెట్టింది. రాయచూర్‌లో చెప్పిన ప్రదేశానికి  మొత్తం 50 లక్షలు తీసుకోని వస్తే 2 కిలోల డ్రగ్స్ ఇస్తానని శ్రీధర్ సాగర్ తెలిపాడు. అతని ట్రాప్ చేసుకుంటూ వెళ్లగా... ఉదయం వస్తానని చెప్పిన శ్రీధర్ సాగర్.. ఎలాంటి డ్రగ్స్ ఇవ్వకుండానే 50 లక్షలు కొట్టేయడానికి స్కెచ్ వేశాడు. కానీ సైబరాబాద్‌ ఎస్‌వోటీ టీమ్‌ వలపన్ని అతణ్ని పట్టుకుంది. 


బాధితుడు రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీధర్‌సాగర్‌ను శామీర్‌పేట్‌ పీఎస్‌లో అప్పగించారు సైబరాబాద్‌ ఎస్‌వోటి పోలీసులు. సోషల్ ఇంజినీరింగ్ చాటున జరుగుతున్న బ్లాక్ మెయిల్‌ దందా ఇక్కడితో ముగియలేదు.. ఇంకా చాలా ఉంది .. ఏబీఎన్‌ క్రైమ్ బ్యూరో దీనిపై ఇంకా ఇన్వెస్ట్ గేషన్ చేస్తూనే ఉంది.


ఈ కేసులో సెలబ్రెటీలు, మాజీ  బిగ్‌బాస్ పార్టీస్పెట్స్, సినీ ప్రముఖులు ఉన్నారని భాదితులు చెప్పడంతో.. ఆ దిశగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శామీర్‌పేట్‌ పోలీసులు శ్రీధర్ సాగర్‌ను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఎవరైనా సోషల్‌ ఇంజినీరింగ్‌ బ్లాక్‌మెయిలర్స్‌ బారినపడి మోసపోయి ఉంటే తమకు తెలపాలని పోలీసులు కోరుతున్నారు.



Updated Date - 2021-09-14T04:33:50+05:30 IST