పురం వైసీపీలో సోషియల్‌ మీడియా కోల్డ్‌వార్‌

ABN , First Publish Date - 2021-01-19T07:17:34+05:30 IST

హిందూ పురం వైసీపీలో మరో సారి అంతర్గత విభేదాలు భగ్గు మన్నాయి. సోషియల్‌ మీడి యాలో కోల్డ్‌వార్‌ పంచాయతీ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

పురం వైసీపీలో సోషియల్‌ మీడియా కోల్డ్‌వార్‌
సీఐ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న నవీన్‌


- పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయతీ

- వలసదారుల పెత్తనంపై తేల్చుకుంటాం

- ఎమ్మెల్సీపై నవీన్‌ ఫైర్‌


హిందూపురం, జనవరి18: హిందూ పురం వైసీపీలో మరో సారి అంతర్గత విభేదాలు భగ్గు మన్నాయి. సోషియల్‌ మీడి యాలో కోల్డ్‌వార్‌ పంచాయతీ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. హిందూపురంలో వలసపె త్తందార్లు పోలీసులను అడ్డం పెట్టుకని నిజమైన వైసీపీ నాయ కులు, కార్యకర్తలను వేధిస్తున్నా రంటూ  వైసీపీ హిందూపురం పార్ల మెంట్‌ అధ్యక్షుడు నవీన్‌నిక్చల్‌ ఏకంగా వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పంచాయతీ పెట్టారు. ఇటీవల కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అహమ్మద్‌, నవీన్‌నిశ్చల్‌ వర్గీ యుల మధ్య సోషియల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్య లు, పోస్టింగులు పెట్టుకుంటూ రచ్చకే క్కారు. ఈనేపథ్యంలో సోమవారం నవీన్‌నిశ్చల్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషకు అనుచరులతో వచ్చి సీఐ బాల మద్దిలేటితో వాగ్వావాదం చేఽశారు. ఇటీవల సోషియల్‌ మీడియాలో తనపైవ్యక్తి గతంగా వ్యతి రేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టిం గులు పెడుతున్నా ఒక్కరి పైనైనా చర్యలు చేపట్టింటే చూపించాలని సీఐని నిలదీశారు. వైసీపీ నిజమైన కార్యకర్తలు, తన అనుచరులపై మాత్రం చర్యలు చేపట్టడం ఏంలని ప్రశ్నించారు. పోలీ సులు ఏకపక్షంగా వ్యవహరిం చకుండా పనిచేయాలని వాడోనేనో హిందూపురంలో తేల్చుకుంటానని పరో క్షంగా ఎమ్మెల్సీని ఉద్దేశించి హెచ్చరిం చారు. ఈసందర్భంగా ఎవ్వరీని ఉపేక్షిం చేదిలేదని సమస్యకు కారణమైన ఇరువ ర్గాలను పిలిపించి చర్యలు చేపడతామని సీఐ సమాధానం ఇచ్చారు. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్‌ విలేకరులతో మాట్లాడుతూ తనను, తన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని అందుకే వన్‌టౌన్‌ సీఐ వద్దకు వచ్చి విషయాన్ని చెప్పానన్నారు. వలసవచ్చిన ఒకాయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనతోపాటు పార్టీకో సం పనిచేసిన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు. గతంలో ఆరేళ్లుగా ఎండనక వాన నక కుటుంబాన్ని వదిలి తాను, నిజమైన కార్యకర్త లు పార్టీ కోసం కష్టపడ్డామన్నారు. అయితే నేడు పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడవా లిపోయే వలసదారులకు పెత్తనం అయి పోయిందన్నారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఈవిషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లుతా వారి నిర్ణయానికి వదిలేసి చూస్తాం అన్నారు. నావద్దే నిజమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని అక్కడ 2019 ఎన్నికల తరువాత వచ్చిన వలసపక్షులే ఉన్నారని ఎమ్మెల్సీని ఉద్దేశించి చెప్పారు. హిందూపురంలో అధికార పార్టీలో వర్గపోరు సోషియల్‌ మీడియాలో ఫోస్టింగుల వార్‌తో పోలీస్‌స్టేషన్‌కు పంచాయతీ చేరడంతో చర్చంశనీయంగా మారింది. 

Updated Date - 2021-01-19T07:17:34+05:30 IST