ఉగాండాలో సోషల్‌ మీడియాపై నిషేధం

ABN , First Publish Date - 2021-01-13T14:46:46+05:30 IST

ఉగాండాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు సోషల్‌ మీడియాపై ఆ దేశ ప్రభుత్వం మంగళవారం నిషేధం విధించింది. అధ్యక్ష

ఉగాండాలో సోషల్‌ మీడియాపై నిషేధం

కంపాలా, జనవరి 12: ఉగాండాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు సోషల్‌ మీడియాపై ఆ దేశ ప్రభుత్వం మంగళవారం నిషేధం విధించింది. అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌, వాట్సా్‌పతో పాటు ఇతర మెసేజింగ్‌ యాప్‌లను కూడా నిలిపివేయాలని ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను కమ్యూనికేషన్ల నియంత్రణ సంస్థ ఆదేశించింది. దీంతో ఆ దేశ యూజర్లు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు.


ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలను ఫేస్‌బుక్‌ నిలిపివేసినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని టెలికాం కంపెనీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ గళాన్ని నొక్కేసేందుకే సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించామని ప్రభుత్వం సాకులు చెబుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.  

Updated Date - 2021-01-13T14:46:46+05:30 IST