జగన్‌తోనే సామాజిక న్యాయం

ABN , First Publish Date - 2022-05-23T05:12:36+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈనెల 26 నుంచి శ్రీకాకుళంలో ప్రారంభించనున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు.

జగన్‌తోనే సామాజిక న్యాయం
మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

బస్సు యాత్రను విజయవంతం చేయాలి
మంత్రులు బొత్స, మేరుగ నాగార్జున
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 22:
సీఎం జగన్మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈనెల 26 నుంచి శ్రీకాకుళంలో ప్రారంభించనున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం వైసీపీ జిల్లా  కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ జయభేరి పేరిట చేపడుతున్న బస్సుయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో జరిగిన సామాజిక న్యాయం.. ఇప్పుడు మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమం మహా విప్లవంలా సాగుతోందని చెప్పారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బలహీనవర్గాలకే జగన్‌ ఇచ్చారన్నారు. లోకేష్‌ శవరాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుది ఆంధ్రా? లేక తెలంగాణ? చెప్పాలన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు జరగాల్సిన ఎన్నికలను కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పలువురు ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T05:12:36+05:30 IST