పార్లమెంట్‌ సమావేశాల్లో భౌతిక దూరం

ABN , First Publish Date - 2020-07-12T08:12:40+05:30 IST

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు ఎంపీలు వ్యక్తిగతంగా హాజరు కావల్సి రావచ్చని లోక్‌సభ...

పార్లమెంట్‌ సమావేశాల్లో భౌతిక దూరం

  • ఏర్పాట్లపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ సమీక్ష


న్యూఢిల్లీ, జూలై 11:  కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు ఎంపీలు వ్యక్తిగతంగా హాజరు కావల్సి రావచ్చని లోక్‌సభ, రాజ్యసభలు అవి ఉన్న ప్రదేశాల నుంచే పని చేస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నా యి. పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించడానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు శనివారం సమావేశమయ్యారు. సమావేశాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్‌ను కోరారు. భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది కాబట్టి లోక్‌సభ, రాజ్యసభతోపాటు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని ఇతర భవనాల్లో కూడా ఎంపీలకు సీటింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు 22 కంటే ముందే సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. 


Updated Date - 2020-07-12T08:12:40+05:30 IST