సామాజిక దూరమే కీలకం: లాన్సెట్‌

ABN , First Publish Date - 2020-03-26T06:20:43+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల మార్గాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. చాలావరకు దేశాలు వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్‌డౌన్‌ల మీదనే ఎక్కువగా

సామాజిక దూరమే కీలకం: లాన్సెట్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల మార్గాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. చాలావరకు దేశాలు వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్‌డౌన్‌ల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇలాంటి నిర్బంధ చర్యలతోపాటు అనేక ఇతర పద్ధతులను కూడా పాటించినప్పుడే వైరస్‌ను సమర్థంగా అరికట్టవచ్చని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తన తాజా పరిశోధనలో పేర్కొంది. ముఖ్యంగా సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్సింగ్‌) పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొంది. సింగపూర్‌లో కరోనా నియంత్రణ కోసం అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలను లాన్సెట్‌ ప్రచురించింది.


సింగపూర్‌ ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని లాన్సెట్‌ అధ్యయనం కొన్ని సూచనలు చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధ చర్యలు తీసుకోవడంతోపాటు సామాజిక దూరం పాటించడం, స్కూళ్లను మూసివేయడం, ఆఫీసుల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సింగపూర్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని సూచించింది. తొలిదశలోనే ఇవన్నీ అమలుచేస్తే తర్వాతి దశల్లో వైరస్‌ బారిన పడేవారి సంఖ్యను చాలావరకు తగ్గించవచ్చని పేర్కొంది.

Updated Date - 2020-03-26T06:20:43+05:30 IST