సామాజిక దూరం తప్పనిసరి!

ABN , First Publish Date - 2020-12-23T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ తన రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తోన్న ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖానికి మాస్క్‌ పెట్టుకున్నాం కదా!

సామాజిక దూరం తప్పనిసరి!

కరోనా వైరస్‌ తన రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తోన్న ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖానికి మాస్క్‌ పెట్టుకున్నాం కదా! కరోనా సోకదని అనుకోవద్దు. బయటకు వెళ్లినప్పుడు, జన సందోహం ఉన్నచోట మాస్క్‌తో పాటు దూరం పాటించడం చాలా ముఖ్యం అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని న్యూ మెక్సికో యూనివర్సిటీ పరిశోధకులు సాధారణ క్లాత్‌ మాస్క్‌, రెండు పొరల మాస్క్‌, సర్జికల్‌ మాస్క్‌, ఎన్‌95 మాస్క్‌లు కరోనా కణాలను ఎంతగా నిలువరిస్తాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేశారు. వారి పరిశీలనలో అన్ని మాస్క్‌లు కరోనా వైరస్‌ వ్యాప్తిని కొంత వరకు అడ్డుకుంటాయని తేలింది. 


అయితే సామాజిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువని కనుగొన్నారు. ‘‘మాస్క్‌ కచ్చితంగా కరోనా సోకకుండా రక్షణనిస్తుంది. అయితే బాగా దగ్గరగా ఉంటే మాత్రం వైరస్‌ సోకే వీలుంది’’ అంటున్నారు ప్రొఫెసర్‌ కృష్ణ కోట.

Updated Date - 2020-12-23T05:30:00+05:30 IST