1308 పాల కలశాలతో శోభాయాత్ర

ABN , First Publish Date - 2022-10-04T05:14:39+05:30 IST

దేవీ శరన్నవ రాత్రులలో భాగంగా వి.కోటలోని దుర్గమ్మకు సోమవారం పాలాభిషేకం జరిగింది. దుర్గాష్టమిని పురస్కరించుకుని 1308 పాలకలశాలతో మహిళలు పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు.

1308 పాల కలశాలతో శోభాయాత్ర
దుర్గమ్మ వారికి పాలకలశాలను తీసుకువస్తున్న మహిళల శోభాయాత్ర

దేవీ శరన్నవ రాత్రులలో భాగంగా  వి.కోటలోని దుర్గమ్మకు సోమవారం పాలాభిషేకం జరిగింది. దుర్గాష్టమిని పురస్కరించుకుని 1308 పాలకలశాలతో మహిళలు పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. తొలుత దుర్గమ్మ ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్‌ సుబ్రమణ్యంరాజు, సభ్యుల ఆధ్వర్యంలో దుర్గా హోమం నిర్వహించారు. అనంతరం వేణుగోపాలస్వామి ఆలయం వద్దకు చేరుకున్న మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యాన పాలకలశాలను అందించారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎంపీపీ యువరాజ్‌ దంపతులతో పాటు అన్ని ఆలయాల ధర్మకర్తలు అమ్మవారికి సారెను తీసుకుని, పురవీధుల మీదుగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. క్యూలైన్‌లో వచ్చి అమ్మవారికి పాలకలశం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి అమ్మవారు దుర్గాదేవిగా కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. సర్పంచి పీఎన్‌ లక్ష్మి కుటుంబ సభ్యులు ఊంజల్‌ సేవ చేపట్టారు. కోట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబీకులు భక్తులకు అన్నదానం చేశారు. మండలంతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సీఐ ప్రసాద్‌బాబు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

- వి.కోట

Updated Date - 2022-10-04T05:14:39+05:30 IST