Himachalలో విస్తారంగా కురుస్తున్న మంచు...బ్లాక్ అయిన రోడ్లు

ABN , First Publish Date - 2022-02-05T13:28:42+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శనివారం విస్తారంగా మంచు కురుస్తోంది....

Himachalలో విస్తారంగా కురుస్తున్న మంచు...బ్లాక్ అయిన రోడ్లు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శనివారం విస్తారంగా మంచు కురుస్తోంది. గురువారం నుంచి కురుస్తున్న మంచు సిమ్లా నగరంతోపాటు పలు ప్రాంతాలను మంచు కప్పేసింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.ఎత్తైన కొండల్లో మంచు కురుస్తుండటంతో చలిగాలులు వీస్తున్నాయి. హిమాచల్ లో అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ 6.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.చంబా, కాంగ్రా, కులూ, లాహౌల్-స్పితి, కిన్నౌర్, సిర్మౌర్, మండి, సిమ్లా జిల్లాల్లో గురువారం నుంచి నిరంతర హిమపాతం కారణంగా ఈ ప్రాంతాల్లోని చాలా రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.రోడ్లపై మంచు ఉండటంతో ప్రయాణాలు చేయవద్దని సిమ్లా పోలీసులు సూచించారు.కుఫ్రి, నరకంద, ఖిడ్కి, ఖరపత్తర్‌లో కూడా మంచు భారీగా పేరుకుపోవడంతో రోడ్లను మూసివేశారు.


Updated Date - 2022-02-05T13:28:42+05:30 IST