Abn logo
Sep 26 2021 @ 00:38AM

చెరువులవేనంలో మంచు అందాలు

చెరువులవేనంలో మంచు అందాలను అస్వాదిస్తూ సందడి చేస్తున్న పర్యాటకులు


శీతాకాలం ఆరంభానికి ముందే తరలివస్తున్న పర్యాటకులు

చింతపల్లి, సెప్టెంబరు 25: శీతాకాలం ప్రారంభానికి ముందే ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి, చెరువులవేనం మంచు అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. శనివారం చెరువులవేనం మంచు అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. వీకెండ్‌ కావడంతో చెరువులవేనంలో ఉదయం ఆరుగంటల నుంచే పర్యాటకుల సందడి ప్రారంభమైంది. పదకొండు గంటల వరకు మంచు అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. గత వారం నుంచి వీకెండ్‌ శని, ఆదివారాల్లో చెరువులవేనం గ్రామాన్ని పర్యాటకులు సందర్శిస్తున్నారని గ్రామ వలంటీరు నాగరాజు తెలిపారు.