కరిగిన 28 లక్షల కోట్ల టన్నుల మంచు

ABN , First Publish Date - 2021-01-27T06:51:06+05:30 IST

గత రెండున్నర దశాబ్దాల్లో (1994 - 2017) భూ ఉపరితలంపై నుంచి 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ శాస్త్రవేత్తలు

కరిగిన 28 లక్షల కోట్ల టన్నుల మంచు

లండన్‌, జనవరి 26: గత రెండున్నర దశాబ్దాల్లో (1994 - 2017) భూ ఉపరితలంపై నుంచి 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2.15 లక్షల పర్వత గ్లేసియర్లు, గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాల్లోని ధ్రువ ప్రాంత మంచు పలకలతో పాటు ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ మహాసముద్రాల్లోని సముద్రపు మంచులపై శాటిలైట్లు సేకరించిన సమాచారంతో జరిపిన సర్వేలో ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. 1980 సంవత్సరం నుంచి ప్రతి పదేళ్లకు 0.26 నుంచి 0.12 డిగ్రీల సెల్సీయస్‌ మేర వాతావరణం, మహా సముద్రాలు వేడెక్కుతున్నాయని వెల్లడించారు. గ్లోబల్‌ వార్మింగ్‌  వల్ల పర్వత గ్లేసియర్లు క్రమంగా కరిగిపోతున్నాయని తెలిపారు. 

Updated Date - 2021-01-27T06:51:06+05:30 IST