హోం క్వారంటైన్‌ బాధితులకు ప్రత్యేక యాప్‌

ABN , First Publish Date - 2020-03-28T05:53:32+05:30 IST

కరోనా కారణంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి ఇంతా అంతా కాదు. వారు తమ స్నేహితులతో కలువలేరు, బంధువులతో మాట్లాడలేరు. పోనీ బోర్‌ కొడుతోందని ఫేస్‌బుక్‌...

హోం క్వారంటైన్‌ బాధితులకు ప్రత్యేక యాప్‌

కరోనా కారణంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి ఇంతా అంతా కాదు. వారు తమ స్నేహితులతో కలువలేరు, బంధువులతో మాట్లాడలేరు. పోనీ బోర్‌ కొడుతోందని ఫేస్‌బుక్‌ లేదా వాట్సాప్‌ ఓపెన్‌ చేసినా, వాటినిండా కరోనా వార్తలే. ఇప్పుడు ఇలాంటి వారికోసమే సోషల్‌ మీడియా యాప్‌ ‘స్నాప్‌ చాట్‌’ త్వరలో ‘‘హియర్‌ ఫర్‌ యూ’’ పేరుతో ఒక మెంటల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెర్చ్‌ టూల్‌ని ఆవిష్కరించబోతోంది. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి, హోం క్వారంటైన్‌ అనుభవిస్తున్నవారికి ఈ టూల్‌ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా కరోనాకు సంబంధించి అనేక ఫీచర్లు ఈ టూల్‌లో ఉండనున్నాయి. మానసిక, శారీరక ఒత్తిడికి గురికావడం, అనవసర ఆందోళనలకు లోనవడం వంటి సమస్యలకు పరిష్కారాలను ఈ టూల్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా బాధితులు తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్లకు అదనంగా కరోనా వైరస్‌ బాధితుల కోసం స్నాప్‌ చాట్‌ మరికొన్ని ఫీచర్లను జతచేయనుంది. యాడ్‌ కౌన్సిల్‌, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, సిడిసి, క్రైసిస్‌ టెక్స్‌ట్‌ లైన్‌, ఎన్‌హెచ్‌ఎస్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధి ఆరోగ్య సంస్థలు కరోనా బారిన పడి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికోసం రూపొందించిన సమాచారాన్ని స్పాప్‌చాట్‌ ఈ టూల్‌లో అప్‌డేట్‌ చేస్తుంది.

Updated Date - 2020-03-28T05:53:32+05:30 IST