స్నాప్‌చాట్‌ ఫ్యామిలీ సెంటర్‌

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌ చాట్‌ తొలిసారి పేరెంటల్‌ కంట్రోల్‌ టూల్స్‌ని విడుదల చేసింది. తమ పిల్లలు, ముఖ్యంగా టీన్స్‌ ఎవరితో మాట్లాడుతున్నారన్నది తెలుసుకునేందుకు ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి. అయితే తమ పిల్లలతో వారు జరిపిన

స్నాప్‌చాట్‌ ఫ్యామిలీ సెంటర్‌

పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌ చాట్‌ తొలిసారి పేరెంటల్‌ కంట్రోల్‌ టూల్స్‌ని విడుదల చేసింది. తమ పిల్లలు, ముఖ్యంగా టీన్స్‌ ఎవరితో మాట్లాడుతున్నారన్నది తెలుసుకునేందుకు ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి. అయితే తమ పిల్లలతో వారు జరిపిన సంభాషణ లేదంటే దాని సారాంశం మాత్రం తెలియదు. దీనికి ఫ్యామిలీ సెంటర్‌ అని పేరు పెట్టింది. పిల్లలపై పెద్దలకు అదుపు ఉండటం లేదని సామాజిక కంపెనీలు దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో స్నాప్‌చాట్‌ ఈ టూల్స్‌కు శ్రీకారం చుట్టింది. అమెరికా శాసనకర్తల ఎదుట స్నాప్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌ గత అక్టోబర్‌లో ఈ విషయంపైనే నిల్చోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.


పిల్లల పరిరక్షణపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతోందన్న విషయమై ఫేస్‌బుక్‌ విజిల్‌ బ్లోయిర్‌ సంబంధిత అంతర్గత డాక్యుమెంట్లను లీక్‌ చేసింది. ఫ్యామిలీ సెంటర్‌ విషయానికి వస్తే, తల్లిదండ్రులు తమ పిల్లలను దీనికి ఆహ్వానించవచ్చు. పిల్లల అంగీకారంతో వారి స్నేహితుల జాబితాను చూడవచ్చు. గడచిన ఏడు రోజుల్లో ఎవరెవరితో తమ పిల్లలు మాట్లాడారన్నంత వరకు తెలుసుకోవచ్చు. ఎవరైనా యూజర్‌ తమ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే నోటిఫికేషన్ల రూపంలో పేరెంట్స్‌కు సమాచారం అందుతుంది. ఇదంతా రాబోయే నెలల్లో జరగనుంది. స్నాప్‌ మాదిరిగానే ఈ మార్చిలోనే ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్యామిలీ సెంటర్ని ఆరంభించింది. 

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST