గ‌దిలో నుంచి 123 పాము పిల్ల‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో...

ABN , First Publish Date - 2020-05-20T16:33:48+05:30 IST

ఇంట్లో పాము క‌నిపిస్తే హ‌డ‌లిపోతాం. మ‌రి రోజూ అలా పాములు క‌నిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రౌన్ ప‌రిధిలోగ‌ల‌ చాచాయ్ గ్రామంలోని ఒక ఇంట్లో నుంచి ప్రతిరోజూ రోజూ 5 నుంచి...

గ‌దిలో నుంచి 123 పాము పిల్ల‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో...

భింద్: ఇంట్లో పాము క‌నిపిస్తే హ‌డ‌లిపోతాం. మ‌రి రోజూ అలా పాములు క‌నిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రౌన్ ప‌రిధిలోగ‌ల‌ చాచాయ్ గ్రామంలోని ఒక  ఇంట్లో నుంచి ప్రతిరోజూ రోజూ 5 నుంచి 25 పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. గత 8 రోజుల్లో 123 పాము పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న కుటుంబ స‌భ్యులంతా హ‌డ‌లెత్తిపోతున్నారు. దీంతో ఆ ఇంట్లోనివారంతా పొరుగు ఇంటికి వెళ్లి ప‌డుకుంటున్నారు. రాంప్రకాష్ కుశావ‌హ్‌ ఇంట్లో రాత్రిపూట పాము పిల్ల‌లు బయటకు వస్తున్నాయి. దీని గురించి రాంప్ర‌కాష్ పంచాయతీ అధికారులు సమాచారం ఇచ్చాడు. అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, పాములు ప‌ట్టేవారిని పిలిచినా పాము ఎక్క‌డ ఉన్న‌దో ఇంత‌వ‌ర‌కూ తెలియ‌లేద‌న్నారు. 

Updated Date - 2020-05-20T16:33:48+05:30 IST