పాము తలకు కండోమ్.. కాపాడిన రెస్క్యూ టీం

ABN , First Publish Date - 2021-01-06T01:41:37+05:30 IST

మనుషులు రోజురోజుకూ హింసాత్మకంగా, పైశాచికంగా మారిపోతున్నారనడానికి మరో ఉదాహరణ ముంబైలో చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాము తలకు...

పాము తలకు కండోమ్.. కాపాడిన రెస్క్యూ టీం

ఇంటర్నెట్ డెస్క్: మనుషులు రోజురోజుకూ హింసాత్మకంగా, పైశాచికంగా మారిపోతున్నారనడానికి మరో ఉదాహరణ ముంబైలో చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాము తలకు ఓ ఉపయోగించిన కండోమ్‌ను తొడిగి వెళ్లిపోయారు. దీంతో ఆ పాము నానా అవస్థలు పడుతూఉంది. తిండి తినలేక, నీరు తాగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఎన్ని రోజుల నుంచి ఈ పాము ఇలా అవస్థలు పడుతుందేమో కానీ.. శనివారం ముంబై కందివాల్(తూర్పు) ప్రాంతంలో కొందరికి కనిపించింది. దీని దుస్థితి చూసిన వారు వెంటనే దగ్గరలోని వెటర్నరీ అధికారి వద్దకు తీసుకెళ్లారు. అయితే ఈ పని సాధారణ వ్యక్తులు చేయలేరని, ఎవరో నిపుణుడైన పాములు పట్టే వ్యక్తే చేసి ఉంటాడని వారు చెబుతున్నారు. ఎందుకంటే చెక్కర్డ్ కీల్‌బ్యాక్ అనే ఈ పాములో విషం ఉంటుందని, దీనిని పట్టుకోవడం అందరికీ సాధ్యం కాదని వారంటున్నారు.

Updated Date - 2021-01-06T01:41:37+05:30 IST