పశువులపాక గోడలో పాముల పుట్ట

ABN , First Publish Date - 2021-04-13T05:23:09+05:30 IST

పశువులపాక గోడలో పాముల పుట్ట వెలుగులోకి వచ్చిన ఘటన

పశువులపాక గోడలో పాముల పుట్ట
గోడలో నుంచి బయటకు వచ్చిన పాములు

  • 200 పాములను చంపిన గ్రామస్థులు 
  • కందుకూరు మండలం గఫూర్‌నగర్‌లో ఘటన 


కందుకూరు: పశువులపాక గోడలో పాముల పుట్ట వెలుగులోకి వచ్చిన ఘటన కందుకూరు మండలంలోని గపూర్‌నగర్‌లో సోమవారం చోటుచేసు కుంది. గ్రామానికి చెందిన ఈర్లపల్లి దయా నంద్‌కు ఉన్న పశువులకు తన ఇంటి ముందే పాక వేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం పశువుల  పాకలో ఉన్న చెట్టుకింద కూర్చున్న ఆయనకు పాము కనిపించింది. దీంతో గ్రామంలోని యువకులకు సమాచారం ఇచ్చాడు. యువకులు వచ్చి దాన్ని చంపేశారు. వెంటనే మరొక పాము గోడలోంచి బయటకు వచ్చింది. దీన్ని గమనించిన యువకులు మరికొంత మందికి సమాచారం ఇచ్చారు. సుమారు ఆరుగురు యువకులు గోడ వద్ద ఉండి వెంటవెంటనే బయటకు వచ్చిన పాములను చంపివేశారు. చివరికి ఆ పాములు ఏర్పాటు చేసుకున్న స్థావరాన్ని కూల్చివేయగా అందులోంచి సుమారు 200పాములతో పాటు పాముల గుడ్లు బయటపడ్డాయి. మొత్తం పాములను చంపివేయడంతో గ్రామస్థులు, ఈర్లపల్లి దయానంద్‌ కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వాటిని చూడడానికి బారులుతీరారు. ఇలాంటి సంఘటన తమ గ్రామంలో ఎప్పుడూ వెలుగులోకి రాలేదని గ్రామస్థులు తెలిపారు. 



Updated Date - 2021-04-13T05:23:09+05:30 IST