Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ..

ఆంధ్రజ్యోతి(02-04-2020)


ధూమపానంతో గుండెనొప్పి

ఎలా అర్థం చేసుకున్నా సరే.. ఇది నిజమంటున్నాయి తాజా అధ్యయనాలు. ‘సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అన్న విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోం. కానీ, గుండెనొప్పి వచ్చే ప్రమాదం సిగరెట్ వల్ల మరింత పెరుగుతుందన్న విషయం 21దేశాల్లో కొన్ని సంవత్సరాల పాటు చేసిన సర్వేల్లో వెల్లడైంది. ఎక్కువ శాతం హార్ట్ స్ట్రోక్ కేవలం ధూమపానం కారణంగానే వస్తుందని ఆ సర్వేలు తేల్చాయి. సాధారణంగా ఫుడ్ నిర్లక్ష్యంతో వస్తున్న గుండెనొప్పులు 25 శాతం ఉంటే సిగరెట్ స్మోకింగ్ కారణంగా 48 శాతం వస్తున్నాయి. తరచూ ప్రతి సందర్భానికి సీరియస్‌గా ఫీలవుతూ.. సిగరెట్ తాగే మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. పురుషుల్లో గుండె జబ్బు తీవ్రత 30 శాతం కనిపిస్తుండగా, మహిళల్లో ఇది 46 శాతం ఉంది. రోజుకు ఒకటి, అరా సిగరెట్లు కాల్చేవాళ్లతో పోలిస్తే 20 సిగరెట్లు అంతకంటే ఎక్కువ ధూమపానం చేసే వాళ్లలోనే గుండెకు సమస్యలు ఎక్కువని అధ్యయనకారులంటున్నారు.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...