పొగచూరుతున్న...బతుకులు

ABN , First Publish Date - 2021-11-29T06:25:27+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటలు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

పొగచూరుతున్న...బతుకులు
మధ్యాహ్నా భోజన వంటలు చేస్తున్న కార్మికులు

- దశాబ్దాలుగా మధ్యాహ్న భోజన కార్మికులపై నిర్లక్ష్యం

- కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్‌

జగిత్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటలు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా పథకం నిర్వాహకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో చాకిరీ చేస్తున్న ప్పటికీ తమ సమస్యలను పరిష్కరించే నాథుడు కరువయ్యాడని కార్మి కులు వాపోతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజ న వంట కార్మికులుగా పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమ స్యలపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న కథనమిది...


పరిష్కారానికి నోచుకోని సమస్యలు...

జిల్లా మొత్తం 783 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 511 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 187 జిల్లా పరి షత్‌ ఉన్నత, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారుగా 55 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రతీ రోజు మధ్యాహ్నం భోజనం వండేందుకు సుమారు 2 వేల మంది నిర్వాహకులు పనిచేస్తు న్నారు. ఏజెన్సీల కార్మికులు దశాబ్దాలుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వంట చేసినందుకు 1 నుంచి 5వ తరగతి వరకు రూ. 4.97 పైసలు, 6 నుంచి 8వ తరగతి వరకు రూ. 7.45 పైసలు, 9, 10 త రగతులకు రూ. 9.45 పైసల చొప్పున ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం నిర్వాహకులకు చెల్లిస్తోంది. ఒక గుడ్డుకు రూ. 4ను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందులో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు వారానికి మూడు కోడి గుడ్లు అందివ్వాలి. 9వ, 10వ తరగతి విద్యార్థులకు చెల్లిస్తు న్న బిల్లుల నుంచే వెచ్చించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపులను పెంచాలని  కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

అంతంతమాత్రంగానే వంట గదులు...

జిల్లా వ్యాప్తంగా 783 పాఠశాలలకు గాను సుమారు 200 పాఠశాలల్లో మాత్రమే వంట గదులున్నాయి. చాలా గ్రామాల్లో వంట గదులు ప్రతి పాదన దశలోనే ఉన్నాయి. మిగతా చాలా గ్రామాల్లో గదులు లేవు. ప్రధానంగా చాలా పాఠశాలల్లో తాగునీటి సమస్యలు తాండవిస్తున్నాయి. మిషన్‌ భగీరథ నీరు అందకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బో రు బావులు సరిగా పని చేయడం లేదు. నీటి కోసం చాలా దూరం వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని వండాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తమకు కార్మిక చట్టాన్ని అమ లు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా గౌరవ వేతనాన్ని కార్మిక చ ట్టం రూ. 10,500కు పెంచాలని, అది కూడా నెల నెలా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పీఎఫ్‌, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐలను అమలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

అందని భోజనం బిల్లులు...

జిల్లాలో మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు సకాలంలో బిల్లులు అందడం లేదు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండు నెలల  బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభించి మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు నయా పైసా బిల్లు చెల్లించలేదన్న విమర్శలున్నాయి. గడిచిన యేడాదికి సంబం ధించిన రెండు నెలల బిల్లులు, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబం ధించి రెండు నెలల బిల్లులు విడుదల కావాల్సి ఉంది. సకాలంలో బిల్లు లు అందించకపోవడం వల్ల అప్పు తెచ్చి వంటలు చేయాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. సకాలంలో మధ్యాహ్న భోజన బిల్లులు అందించాలని నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు.

రూ. 10,500 వేతనం అందించాలి

- కూన సరస్వతి, అధ్యక్షురాలు, మధ్యాహ్నా భోజన కార్మిక సంఘం మెట్‌పల్లి

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీసం రూ. 10,500 గౌరవ వేతనం అందించాలి. సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధ రలు పెరగడం, బిల్లులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటన్నాము. వి ద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నా సమస్యలు పరిష్కరించ డం లేదు. కార్మిక చట్టం ప్రకారం రూ. 1000 నుంచి రూ. 10,500 వరకు వేతనాన్ని పెంచాలి. 

కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం

సుతారి రాములు, జిల్లా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకుడు, జగిత్యాల

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటలను చేస్తున్న కార్మి కుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాము. కార్మికులకు సరియైన వేతనాలు అందించాలి. పీఎఫ్‌  సౌకర్యాన్ని కల్పించాలి. గతంలో కార్మికు లకు పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. సమష్టి పోరాటంతో కార్మికుల సమస్యల పరిష్కారం సాధ్యమయ్యే అవకాశాలున్నాయి.





Updated Date - 2021-11-29T06:25:27+05:30 IST