ఫోన్‌ ఒకటే! పోటీలు అనేకం!

ABN , First Publish Date - 2020-03-21T02:37:50+05:30 IST

స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ బాగా పెరిగిపోయాక - ఒక బ్రాండ్‌ లో ఒక్కో మోడల్‌ని టార్గెట్‌ చేస్తూ మరో బ్రాండ్‌ ఇంకో ఫోన్‌ని రిలీజ్‌ చేయడం సాధారణమయింది.

ఫోన్‌ ఒకటే! పోటీలు అనేకం!

స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ బాగా పెరిగిపోయాక - ఒక బ్రాండ్‌ లో ఒక్కో మోడల్‌ని టార్గెట్‌ చేస్తూ మరో  బ్రాండ్‌ ఇంకో ఫోన్‌ని రిలీజ్‌ చేయడం సాధారణమయింది. అయితే ఈ నెలాఖర్లో వస్తున్న షియామీ ఎమ్‌ఐ 10 ఒకేసారి అనేక ఫోన్లకి సవాల్‌ విసురుతోంది. ఈ ఫోన్‌ శ్నాప్‌డ్రాగన్‌ 865 పవర్‌ ఫుల్‌ చిప్‌సెట్‌తో, 5జీ సపోర్ట్‌తో వస్తోంది. పైగా ఇది 108 మెగాపిక్సెల్‌ కెమెరాతో రాబోతోంది. ప్రస్తుతానికి మార్కెట్లో 108 మెగాపిక్సెల్‌ కెమెరా కలిగిన ఫోన్‌ శామ్‌సంగ్‌ గెలాక్సీ S20 అల్ట్రా మాత్రమే ! ఆ రకంగా ఎమ్‌ఐ 10 శామ్‌సంగ్‌ గెలాక్సీ S20 కి మంచి పోటీ ఇవ్వబోతోంది. పైగా దీని రేట్‌ కూడా దాదాపు ఆ రేంజ్‌లోనే ఉంటుంది. వెర్షన్లలో తేడాలు ఎన్ని ఉన్నా ఏవరేజ్‌న దీని ఖరీదు అరవైవేల రూపాయల పైమాటే.


అయితే ఈ ఫోన్‌ శామ్‌సంగ్‌ గెలాక్సీ S20 సీరీస్‌కి మాత్రమే కాకుండా - మరికొన్ని ఫోన్లకి కూడా సవాల్‌ విసరబోతోంది. ముఖ్యంగా - ఇది వన్‌ ప్లస్‌  8 ప్రోకి పోటీ ఇవ్వచ్చు. అలాగే 5G ఫోన్‌ కావడం వల్ల - ప్రస్తుతం క్రేజ్ తెచ్చుకుంటున్న 5G ఫోన్లు ఐక్యూ 3 కీ, రియల్‌ మీ X50 ప్రో కీ కూడా ఇది పోటీ కావచ్చని విశ్లేషకులంటున్నారు.


Updated Date - 2020-03-21T02:37:50+05:30 IST