స్మార్ట్‌ టీవీ హ్యాక్‌ చేయొచ్చు!

ABN , First Publish Date - 2021-10-02T05:30:00+05:30 IST

స్మార్ట్‌ టీవీని హ్యాక్‌ చేయవచ్చా అంటే అవునంటున్నారు టెక్‌నిపుణులు. అంతేకాదు బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌లో జరుగుతున్నవి సంగ్రహించి భవిషత్తులో బ్లాక్‌మెయిల్‌ ....

స్మార్ట్‌ టీవీ హ్యాక్‌ చేయొచ్చు!

స్మార్ట్‌ టీవీని హ్యాక్‌ చేయవచ్చా అంటే అవునంటున్నారు టెక్‌నిపుణులు. అంతేకాదు బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌లో జరుగుతున్నవి సంగ్రహించి భవిషత్తులో బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు అవకాశాలు బలంగా ఇందులో ఉన్నాయి. హ్యాకింగ్‌లో కూడా రెండు రకాలుగా ఉండొచ్చు. అక్కడ జరుగుతున్న విషయాలను గ్రహించడం ఒకటి అయితే ఫోన్‌ల తరహాలోనే బ్రౌజింగ్‌ హిస్టరీని, ప్యాట్రన్‌లను క్యాప్చర్‌ చేయడం మరొకటి.  నోర్డ్‌ఎన్‌పీఎన్‌ సర్వే ప్రకారం అరవై శాతం మంది గృహాల్లో స్మార్ట్‌ టీవీలు ఉన్నాయి. అయితే వీరిలో ప్రతి నాలుగింటిలో ఒకరు మాల్వేర్‌ నుంచి ప్రొటక్షన్‌ కోసం ఏమీ చేయటం లేదని కూడా ఆ సర్వేలో తేలింది. అసలు విషయం ఏమిటంటే ఇంటర్నెట్‌తో సంబంధం కలిగిన డివై్‌సలు మాదిరిగానే స్మార్ట్‌ టీవీలు సైతం పెద్ద ఎత్తున డేటాను కలెక్ట్‌ చేయగలుగుతున్నాయి. సరిగ్గా అదే భద్రతపరంగా దెబ్బతీస్తోంది. ఇంటర్నెట్‌ ఉపయోగించే ఇతర డివై్‌సలకు మాల్వేర్‌ నుంచి యాంటీవైరస్‌ వంటి రక్షణలు ఉన్నాయి. స్మార్ట్‌ టీవీలకు మాత్రం ఆ ఎక్వి్‌పమెంట్‌ లేదు. అదే ఇబ్బందులకు లోనుచేస్తోంది.


నెట్‌ కనెక్ట్‌ చేసి స్మార్ట్‌ టీవీని చూస్తున్నారంటే సాధారణ టీవీ వీక్షకుల కంటే వీరికి కొంత సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగానే ఉన్నట్లు లెక్క. స్మార్ట్‌టీవీకి కనక వైఫై కనెక్ట్‌ చేసి ఉంటే హాకర్లు మాల్వేర్‌ ద్వారా స్మార్ట్‌ టీవీ కెమెరా, మైక్రోఫోన్‌ను యాక్సెస్‌ చేస్తుంటారు.  వైఫైతో కనెక్ట్‌ అయి ఉంటే చాలు బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌ సమాచారాన్ని రాబట్టి భవిష్యత్తులో బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ఉపయోగించుకుంటారు.  ఒకప్పుడు సీఐఏ సృష్టించిన ఈ మాల్వేర్‌ శామ్‌సంగ్‌ స్మార్ట్‌ టీవీల నుంచి తమ ప్రత్యర్థుల సమాచారం పొందేందుకు  ఉపయోగపడేది. ఒకప్పుడు సిఐఏ చేసిన పనే ఇప్పుడు హాకర్లు చేస్తున్నారు. 

యూజర్లు ఆందోళన చెందాల్సిన వాటిలో మరొకటి ట్రాకింగ్‌.  ఇప్పుడు ఈ ట్రాకర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నెట్‌ఫ్లిక్‌, హులు, హెచ్‌బిఓ గో తదితరులు యూజర్లను ట్రాక్‌ చేసి, వారి స్ట్రీమింగ్‌ బిహేవియర్‌ను అంచనా వేసుకుంటారు. ఆందోళన చెందాల్సిన విషయం ఏమంటే ఈ డేటా ఎప్పుడు లీక్‌ అవుతుందో అనే. పెద్ద పెద్ద కంపెనీల్లో డేటా లీక్‌ అయిందనే వార్తలు మనం తరచుగా చదువుతుంటాం. పైన చెప్పిన ఈ కంపెనీలు కూడా లీకేజీకి అతీతం ఏమీ కాదు. 



 దీనికి తోడు స్మార్ట్‌ టీవీలో వెబ్‌బ్రౌజింగ్‌ కూడా చేస్తే కంప్యూటర్ల మాదిరిగా వైర్‌సల బారిన పడతాయి. దానికితో వీటిని అడ్డుకోవడానికి   స్ట్రాంగ్‌ యాంటీవైర్‌సను వినియోగదారులు ఉపయోగించరు. ఒకసారి మాల్వేర్‌ బారిన పడితే, హ్యాకర్లకు యావత్తు సమాచారం లభించినట్టే. అలాగే ఈ సమాచారంతో రాన్‌సమ్‌వేర్‌ అటాక్‌లకు పాల్పడతారు.


హాక్‌కాకుండా స్మార్ట్‌ టీవీని ఎలా రక్షించుకోవాలంటే...

స్మార్ట్‌ టీవీ మార్కెట్‌ గత ఏడాది 202.1 బిలియన్‌ డాలర్లకు మించిన నేపథ్యంలో వాటిని మాల్వేర్‌ తదితర దాడుల నుంచి ప్రొటెక్ట్‌ చేసుకోవాలన్నది నిపుణులు ప్రధాన సూచన. అందుకు గాను మొదట స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్న పక్షంలో అప్లికేషన్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే, ఊహించడానికి వీలులేని విధంగా పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి.  చాలా సంక్లిష్టంగా పాస్‌వర్డ్‌ ఉండాలి. నంబర్లు, లెటర్లను కలిపి కలగూర గంప మాదిరిగా రూపొందించుకోవాలి. సాఫ్ట్‌వేర్‌ ఎప్పటికప్పుడు అంటే కొత్త వెర్షన్‌ అందుబాటులోకి వచ్చిన ప్రతిసారి అప్డేట్‌ కావాలి. సైబర్‌ సెక్యూరిటీపరంగా చూసుకున్నప్పుడు అప్డేట్‌ కీలకమన్నది నిపుణుల ప్రధాన సూచన. అప్డేట్‌తో లోపాల సవరణకు వీలుంటుంది. రూటర్‌ సెక్యూరిటీ కూడా ముఖ్యమే. ఇక్కడ కూడా స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ ఉండాలి. అయితే, వీపీన్‌ సౌలభ్యం ఉంటే, తద్వారా వెళ్ళే డేటా ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటుంది.  అధికారిక స్టోర్స్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం. డేటా, కెమెరా లేదంటే మైక్రోఫోన్‌ సమాచారాన్ని ఏదెనా అప్లికేషన్‌ అడిగితే అస్సలు ఇవ్వవద్దు. ఉపయోగించనప్పుడు టీవీ కెమెరాను టర్నాఫ్‌ చేయండి. లెన్స్‌ని కాగితం/ టేప్‌/ స్టిక్కర్‌తో కవర్‌ చేయండి.

Updated Date - 2021-10-02T05:30:00+05:30 IST