డిసెంబరు 31కల్లా ఫీడర్లకు స్మార్ట్‌ మీటర్లు

ABN , First Publish Date - 2022-05-28T09:49:26+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌/ప్రీపెయిడ్‌ విధానంలో పనిచేసే మీటర్ల బిగింపునకు కేంద్రం గడువు విధించింది. ఎలక్ట్రిసిటీ

డిసెంబరు 31కల్లా ఫీడర్లకు స్మార్ట్‌ మీటర్లు

- కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాలు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌/ప్రీపెయిడ్‌ విధానంలో పనిచేసే మీటర్ల బిగింపునకు కేంద్రం గడువు విధించింది. ఎలక్ట్రిసిటీ చట్టం-2003 సెక్షన్‌ 177లోని సబ్‌ సెక్షన్లు, క్లాజులను అనుసరిస్తూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఏ టీ అండ్‌ సీ(పంపిణీ, సరఫరా, వాణిజ్య నష్టాలు) 15ు పైన ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 25ు దాటితే ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ వినియోగదారులను మినహాయించి.. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో 2022 డిసెంబరు 31 కల్లా స్మార్ట్‌/ప్రీపెయిడ్‌ విధానంలో పనిచేసే మీటర్లు బిగించాలని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు(డీటీ) 2023 మార్చికల్లా మీటరింగ్‌ పూర్తి కావాలని కేంద్రం నిర్దేశించింది.

Updated Date - 2022-05-28T09:49:26+05:30 IST