జన్యువులను ఆన్‌.. ఆఫ్‌ చేయగల ‘స్మార్ట్‌’ ప్రొటీన్లు

ABN , First Publish Date - 2020-04-06T08:10:44+05:30 IST

శరీరంలో ఉండే జీవకణాల్లోని జన్యువులు, ఇతరత్రా అణువులను నియంత్రించగల స్మార్ట్‌ ప్రొటీన్లను అమెరికాలోని వాషింగ్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి వ్యాధి నిరోధక వ్యవస్థలోని తెల్ల రక్తకణాల పనితీరును...

జన్యువులను ఆన్‌.. ఆఫ్‌ చేయగల ‘స్మార్ట్‌’ ప్రొటీన్లు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 5 : శరీరంలో ఉండే జీవకణాల్లోని జన్యువులు, ఇతరత్రా అణువులను నియంత్రించగల స్మార్ట్‌ ప్రొటీన్లను అమెరికాలోని వాషింగ్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి వ్యాధి నిరోధక వ్యవస్థలోని తెల్ల రక్తకణాల పనితీరును కూడా క్రమబద్ధీకరించగలవని వెల్లడించారు. ఈ కృత్రిమ ప్రొటీన్లు శాస్త్రవేత్తలు పంపే సిగ్నళ్ల ఆధారంగా జీవకణాల చుట్టూ కదలాడుతూ తమకు అందే ఆదేశాలకు అనుగుణంగా పనిని చక్కబెడతాయని తెలిపారు. వీటి కదలికల నియంత్రణకు అవసరమైన లాజిక్‌ గేట్లను డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రయోగశాలల్లో  అభివృద్ధిచేశారు.


Updated Date - 2020-04-06T08:10:44+05:30 IST