స్పీడ్‌ చార్జింగ్‌కు సింపుల్‌ టిప్స్‌

ABN , First Publish Date - 2021-12-18T05:30:00+05:30 IST

ఎంత గొప్ప మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసినప్పటికీ చార్జింగ్‌ తప్పనిసరి. ఎల్లప్పుడు ఫోన్‌తో వచ్చిన చార్జర్‌ను ఉపయోగించాలని....

స్పీడ్‌ చార్జింగ్‌కు సింపుల్‌ టిప్స్‌

ఎంత గొప్ప మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసినప్పటికీ చార్జింగ్‌ తప్పనిసరి. ఎల్లప్పుడు ఫోన్‌తో వచ్చిన చార్జర్‌ను ఉపయోగించాలని వేరేవాటితో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా నిపుణులు జాగ్రత్తలు చెబుతుంటారు. చార్జింగ్‌ విషయంలో ఉత్పత్తిదారులే ఎప్పటికప్పుడు లిమిట్స్‌ను అధిగమించే యత్నం చేస్తుంటారు. చార్జింగ్‌ వేగాన్ని పెంచడంలో పవర్‌ బ్రిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రెడేషన్‌ కూడా ఇతోధిక పాత్ర పోషిస్తాయి.  చార్జింగ్‌ స్పీడ్‌ పెంచుకోవడానికి ఈ టిప్స్‌ పాటిస్తే మేలు అంటున్నారు నిపుణులు....


- చార్జింగ్‌ అవుతున్న సమయంలో మొబైల్‌ని ఉపయోగించకూడదు. వేరొకరితో మాట్లాడటం, గేమ్స్‌ ఆడటం వంటివి చేయకూడదు. దాంతో సెల్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. చార్జింగ్‌ వేగం కూడా తగ్గుతుంది. 


- వైఫై, బ్లూటూత్‌ వంటి సర్వీసులు ఎక్కువ మొత్తంలో బ్యాటరీని ఉపయోగించుకుంటాయి. అవసరం లేనప్పుడు వాటిని పక్కకు పెట్టేయడం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.


- ఒరిజినల్‌ కేబుల్‌, అడాప్టర్‌ను మాత్రమే ఉపయోగించుకోవాలి. కంపెనీ బ్రాండ్‌ కాకుండా వేరేవి వాడితే బ్యాటరీ దెబ్బతింటుంది. అదే విధంగా చార్జింగ్‌ వేగం కూడా తగ్గుతుంది. 


- బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసెసింగ్‌ యాప్స్‌ డివై్‌సను ఉపయోగించుకోని సమయంలోనూ పని చేస్తూ ఉంటాయి. ఆ యాప్స్‌ కొంత బ్యాటరీని వాడుకుంటాయి. దాంతో బ్యాటరీ నెమ్మదిగా చార్జ్‌ అవుతుంది. వీటిని కనుక కట్టేసి ఉంచితే బ్యాటరీ ఆదా అవుతుంది.


- మొబైల్‌ని ఏరోప్లేన్‌ మోడ్‌లో ఉంచుకుంటే చార్జింగ్‌ వేగాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుంది. ఆ మోడ్‌లో నెట్‌వర్క్‌ నుంచి డిస్‌కనెక్ట్‌ అయ్యేందుకు తోడ్పడుతుంది. ఫలితంగా బ్యాటరీని ఉపయోగించడం కూడా తగ్గుతుంది. 


- స్మార్ట్‌ ఫోన్‌ ఏదైనప్పటికీ అందులో కొన్ని చార్జింగ్‌ సైకిల్స్‌ ఉంటాయి. స్మాల్‌ క్విక్‌ చార్జర్లతో బ్యాటరీ లైఫ్‌ లాంగ్‌రన్‌లో దెబ్బతింటుంది. 


- రాత్రంతా చార్జింగ్‌లో ఉంచడం అస్సలు మంచి పద్ధతి కానేకాదు. ఉపయోగంలో ఉండదు కనుక, రాత్రంతా చార్జింగ్‌ పెట్టేసుకుంటే మంచిదని అనుకుంటారు. అది కరెక్ట్‌ కాదు. ఒక వారం, నెలరోజుల్లో ఏమీ కాకున్నా, లాంగ్‌రన్‌లో చార్జింగ్‌ వేగం గణనీయంగా తగ్గుతుంది. 

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST