మధుమేహులకు ‘స్మార్ట్‌ ఇన్సులిన్‌ ప్యాచ్‌’

ABN , First Publish Date - 2020-02-10T07:08:08+05:30 IST

రూపాయి నాణెం సైజులో ఉండే స్మార్ట్‌ ఇన్సులిన్‌ డెలివరీ ప్యాచ్‌ను నార్త్‌ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మధుమేహులు శరీరానికి అతికించుకోగానే ఈ ప్యాచ్‌ తన పనిని

మధుమేహులకు  ‘స్మార్ట్‌ ఇన్సులిన్‌ ప్యాచ్‌’
????????? ??????????

బోస్టన్‌, ఫిబ్రవరి 9 : రూపాయి నాణెం సైజులో ఉండే స్మార్ట్‌ ఇన్సులిన్‌ డెలివరీ ప్యాచ్‌ను నార్త్‌ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మధుమేహులు శరీరానికి అతికించుకోగానే ఈ ప్యాచ్‌ తన పనిని మొదలుపెడుతుంది. దీని దిగువన 1 మిల్లీమీటరు కంటే తక్కువ పొడవు ఉండే అతిసూక్ష్మమైన సూదులు ఉంటాయి. వీటిలో ముందుగానే నింపిన కృత్రిమ ఇన్సులిన్‌ ఉంటుంది. మధుమేహుల శరీరంలో బ్లడ్‌ షుగర్‌, గ్లూకోజ్‌ మోతాదు బాగా తగ్గిందని తెలియగానే దీనిలోని సూదుల నుంచి ఇన్సులిన్‌ రోగి శరీరంలోకి విడుదలవుతుంది. ఈవిధంగా రక్తంలోని చక్కెర మోతాదులో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకోకుండా ఇన్సులిన్‌ డెలివరీ ప్యాచ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 

Updated Date - 2020-02-10T07:08:08+05:30 IST