నాగార్జునసాగర్‌లో పోటీ

ABN , First Publish Date - 2021-03-02T06:43:04+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో చిన్న పత్రికల సంపాదకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు కలిపి మొత్తం 200 మంది పోటీ చేయనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు తెలిపారు.

నాగార్జునసాగర్‌లో పోటీ

చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం

పంజాగుట్ట, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో చిన్న పత్రికల సంపాదకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు కలిపి మొత్తం 200 మంది పోటీ చేయనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు అగస్టీన్‌, కోశాధికారి ఆజంఖాన్‌తో కలిసి ఆయన మాట్లాడారు. చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రకటనలు నిలిపివేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో అధికారులది ఇష్టారాజ్యంగా మారిందని, అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇప్పటి వరకు సమాచార శాఖకు కమిషనర్‌ లేరన్నారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని, వివక్షమాని అన్ని పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-03-02T06:43:04+05:30 IST