స్వల్పంగా తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

ABN , First Publish Date - 2020-09-15T05:45:50+05:30 IST

దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో స్వల్పంగా తగ్గి 6.69 శాతంగా నమోదైంది. అయితే ఇదే నెలలో టోకు ధరల

స్వల్పంగా తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో స్వల్పంగా తగ్గి 6.69 శాతంగా నమోదైంది. అయితే ఇదే నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం 5 నెలల గరిష్ఠ స్థాయి 0.16 శాతానికి చేరింది. 

జూలైలో ప్రకటించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను కూడా దిగువకు 6.73 శాతానికి సవరించారు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం కూడా స్వల్పంగా తగ్గి 9.05 శాతంగా నమోదైంది. జూలై నెలలో ఇది 9.27 శాతం ఉంది. 

Updated Date - 2020-09-15T05:45:50+05:30 IST