జూరాలకు స్వల్పంగ పెరిగిన వరద

ABN , First Publish Date - 2020-10-30T10:43:36+05:30 IST

జూరాలకు ప్రాజెక్టు వదర ప్రవాహం కొంత మేర పెరిగింది. గురువారం సాయంత్రం ప్రాజెక్టుకు 91 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

జూరాలకు స్వల్పంగ పెరిగిన వరద

గద్వాల, అక్టోబరు 29 ( ఆంధ్రజ్యోతి) : జూరాలకు ప్రాజెక్టు వదర ప్రవాహం కొంత మేర పెరిగింది. గురువారం సాయంత్రం ప్రాజెక్టుకు 91 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో అధికారులు ఏడు గేట్లను ఎ త్తి, దిగువకు 50,743 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పవర్‌ హౌజ్‌ ద్వారా మరో 34,407 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజె క్టు నుంచి మొత్తం 85,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆ ల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి జూరాలకు 30 వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తుంది. మిగిలిన వరద భీమా నుంచి వస్తోంది.


శ్రీశైలానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

దోమలపెంట : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గురువారం జూరాల నుంచి 85,150 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 6,560 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగు లకు గాను, 884.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను, 214.363 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి ఓ గేటు ద్వారా దిగువకు 27,983 క్యూసెక్కుల నీటిని దిగువకు వి డుదల చేస్తున్నారు.


కోయిల్‌సాగర్‌ ఒక గేటు ఎత్తివేత

దేవరకద్ర : మండలంలోని  కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి, 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ డీఈ రవీందర్‌రెడి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సా యంత్రం నాటికి  ప్రాజెక్టులో 32.5 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు తె లిపారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా పంటలకు నీటి విడుదల కొనసాగుతందన్నారు. ప్రాజెక్టు వద్దకు జిల్లాతో పాటు వివిధ గ్రామాల నుంచి సందర్శకులు రావడంతో సందడి నెలకొంది.

Updated Date - 2020-10-30T10:43:36+05:30 IST