కొంచెం మద్దతు

ABN , First Publish Date - 2020-05-30T09:37:31+05:30 IST

ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.53 పెరిగింది. గతేడాది గ్రేడ్‌ఏ రకం ధాన్యానికి రూ.1835గా కేంద్ర ప్రకటించగా, ఈ ఏడాది మరో రూ.53 పెంచడంతో రూ.1888కి చేరింది. సాధారణ రకం ధాన్యం

కొంచెం మద్దతు

ధాన్యం మద్దతు ధర రూ.53 పెంచిన కేంద్రం

గ్రేడ్‌ ఏ రకం రూ.1888   8 కామన్‌ రకం రూ.1868

ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం 

2.25 లక్షల హెక్టార్లలో 12.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా

 

సామర్లకోట, మే 29 : ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.53 పెరిగింది. గతేడాది గ్రేడ్‌ఏ రకం ధాన్యానికి రూ.1835గా కేంద్ర ప్రకటించగా, ఈ ఏడాది మరో రూ.53 పెంచడంతో రూ.1888కి చేరింది. సాధారణ రకం ధాన్యం రూ.1815 ఉండగా ఈ ఏడాది రూ.1868గా నిర్థారించారు. తాజా మద్దతు ధరతో రానున్న ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వరి, మొక్కజొన్న తదితర 15 పంటలకు సంబంధించి మద్దతు ధరలను పెంచుతూ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏపీసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో సాధారణ రకం, గ్రేడ్‌ ఏ రకాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధర కంటే రూ.53 చొప్పున పెంచడానికి సన్నాహాలు చేస్తోంది.


జిల్లాలో సుమారు 330 ధాన్యం కొను గోలు కేంద్రాల వరకు ఏర్పాటు చేసి ప్రభుత్వం గతంలో ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు చేపట్టగా, రానున్న ఖరీఫ్‌ నాటికి 2.25 లక్షల హెక్టార్లలో సాగు ద్వారా వచ్చే 12.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తు లను ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. ఇక ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.53 మాత్రమే పెంపుదల చేయడంతో రైతాంగం పెదవి విరుస్తోంది. సాగుకు పెట్టుబ డులు అధికమవుతున్న తరుణంలో అందుకు తగ్గట్టుగా మద్దతు ధర లభించడం లేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎకరాకు సగటున 35 నుంచి 40 బస్తాల దిగుబ డులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, క్వింటాలుకు కేంద్ర ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్‌-ఏ రకానికి రూ.1888 ప్రకారం బస్తాకు రూ.1416 వస్తుంది.


మొత్తం 35 బస్తాలకు రూ.49 వేల 560 లభిస్తాయి. కానీ ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి వ్య యం అవుతుండగా, రైతుకు మిగిలేది రూ.9560. అది కూడా ఏ-గ్రేడ్‌ రకానికి మాత్రమే. సొంత భూమి సాగు చేసుకునే రైతులకు కొంత మిగులు కనిపించే అవకాశం ఉండగా, కౌలు రైతులకు చేతి చమురు వదిలించుకోవాల్సిందే. సాధారణంగా ఖరీఫ్‌లో కౌలు రైతు లకు ఏమీ మిగలదు. రబీలో లాభం ఉంటుందనే ఆశతోనే సాగులోకి దిగుతారు. అన్ని అవరోధాలనూ దాటుకుని సాగు చేసినా చేతికి మిగిలేది రెండు పదులు కూడా దాటని పరిస్థితి. మద్దతు ధర గణనీయంగా పెరిగితేనే రైతుకు ఎంతోకొంత మిగులుతుంది.

Updated Date - 2020-05-30T09:37:31+05:30 IST