కూర్చుని-కూర్చుని నిద్రపోయే అలవాటు మీకుందా? అది ఎంతటి ప్రమాదమో ఇప్పటికైనా తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-12-30T17:51:52+05:30 IST

మీరు కూర్చుని పనిచేస్తూ, అలాగే డెస్క్‌పై నిద్రపోతున్నారా?..

కూర్చుని-కూర్చుని నిద్రపోయే అలవాటు మీకుందా? అది ఎంతటి ప్రమాదమో ఇప్పటికైనా తెలుసుకోండి!

మీరు కూర్చుని పనిచేస్తూ, అలాగే డెస్క్‌పై నిద్రపోతున్నారా? కొద్దిసేపు అలా పడుకోవడం వలన మీకు ఎంతో విశ్రాంతి లభించిన భావన కలుగుతుంది. అయితే మీరు చేస్తున్న ఈ పొరపాటు ఎంతో ప్రమాదకారిగా మారనున్నదని మీకు తెలుసా? అలా కూర్చుని- కూర్చుని అధికసమయం పాటు పడుకునే అలవాటు తీవ్రమైన వ్యాధులకు దారితీయడంతోపాటు ప్రాణహానిని కలగజేస్తుంది. దీనికి కారణం.. శారీరక జీవక్రియలకు ఆటంకం కలగడం. నిద్రపోయే పొజిషన్ మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 


చాలాసేపు కూర్చున్న స్థితిలోనే పడుకోవడం వలన మీ శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. శరీరంలోని కింది భాగంలో అంటే.. ముఖ్యంగా ముఖ్యంగా కాళ్లలోని నరాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనిని ముందుగానే గుర్తించకపోతే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అంతర్ నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి(Deep Vein Thrombosis) కారణంగా కాళ్లలో ఉన్నట్టుండి నొప్పిపుట్టడం, కాళ్లపై నున్న చర్మం ఎరుపెక్కడం, వాపు మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి పల్మోనరీ ఎంబోలిజం వ్యాధికి దారితీస్తుంది. ఈ స్థితి ఏర్పడినప్పుడు ఉన్నట్టుండి బాధితునికి అనారోగ్యం వాటిల్లుతుంది. ఇది జరిగిన కొద్దిపేపటికే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. పల్మోనరీ ఎంబోలిజం వ్యాధి బారినపడినప్పుడు  ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం కారడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అందుకే కూర్చుని-కూర్చుని నిద్రపోయే అలవాటు మీకుంటే వెంటనే దానిని వదిలించుకోండి. 


Updated Date - 2021-12-30T17:51:52+05:30 IST