కూలిన దుకాణం పైకప్పు

ABN , First Publish Date - 2021-06-24T04:27:16+05:30 IST

నాయుడుపేటలోని దర్గావీధిలో ఓ బియ్యం దుకాణ శ్లాబు కూలి విరిగిపడిన సంఘటన బుధవారం జరిగింది.

కూలిన దుకాణం పైకప్పు
దుకాణంలో కూలిపడ్డ శ్లాబు

నాయుడుపేట టౌన్‌, జూన్‌ 23 : నాయుడుపేటలోని దర్గావీధిలో ఓ బియ్యం దుకాణ శ్లాబు కూలి విరిగిపడిన సంఘటన బుధవారం జరిగింది. గంగిశెట్టి చెంచయ్య మున్సిపల్‌ అద్దె దుకాణంలో ఏడేళ్లుగా బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం దుకాణం మూసివెళ్లాడు. బుధవారం ఉదయం దుకాణం తెరిచేసరికి శ్లాబు విరిగిపడి బియ్యంపైన పడి ఉండటం గుర్తించి మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పగటి పూట శ్లాబు కూలి ఉన్నట్లయితే ప్రాణనష్టం జరిగి ఉండేది.

Updated Date - 2021-06-24T04:27:16+05:30 IST