Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 27 Jan 2022 10:03:42 IST

Salaar : పునఃప్రారంభం కానున్న షూటింగ్

twitter-iconwatsapp-iconfb-icon
Salaar : పునఃప్రారంభం కానున్న షూటింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. యూరోప్ ట్రిప్ ముగిసింది. నిన్ననే (బుధవారం)  హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఇక పూర్తి చేయాల్సిన సినిమాలపై దృష్టిపెట్టబోతున్నారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్, ఆదిపురుష్’ చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ‘సలార్’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా సాధ్యమైనంత తొందరగా ముగించాలన్నది ప్రభాస్ ప్లాన్. దీంతో పాటు ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేయబోతున్నారు. 


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ‘సలార్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ప్రధాన పాత్రను ఈశ్వరీరావు చేస్తున్నారు. రవి బసురూర్ సంగీతం అందిస్తుండగా..  భువన్ గౌడ ఛాయా గ్రహణం నిర్వహిస్తున్నారు. బొగ్గుగనుల మాఫియా నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈసినిమా ప్రభాస్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International