స్కైరూట్‌ ‘క్రయోజెనిక్‌ ఇంజన్‌’

ABN , First Publish Date - 2021-11-26T09:23:26+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్‌ కంపెనీ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ దేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్‌ రాకెట్‌

స్కైరూట్‌ ‘క్రయోజెనిక్‌ ఇంజన్‌’

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్‌ కంపెనీ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ దేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజన్‌ను విజయవంతంగా ప్రదర్శించింది. ప్రముఖ రాకెట్‌ శాస్త్రవేత్త సతీష్‌ ధావన్‌ పేరు మీద ధావన్‌-1గా నామకరణం చేసిన ఈ ఇంజన్‌ను విక్రమ్‌-2 ప్రయోగ వాహన నౌక ఎగువ స్టేజ్‌లో ఉపయోగిస్తారు. 720 కిలోల బరు వున్న పేలోడ్‌ను దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం గల విక్రమ్‌ రాకెట్లలో దీన్ని వాడతారు. 

Updated Date - 2021-11-26T09:23:26+05:30 IST