Advertisement
Advertisement
Abn logo
Advertisement

Prayagraj:సాధువు ఆనంద్‌గిరి విలాస జీవనం

 స్కైడైవింగ్, సూపర్ కార్లు, లగ్జరీ బైక్ లపై రైడింగ్... వరల్డ్ టూర్

ప్రయాగరాజ్‌: అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న నరేంద్రగిరి ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధువు ఆనంద్‌గిరి లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. యూపీలోని ప్రయాగరాజ్‌లోని బాఘంబరి మఠంతో సంబంధం ఉన్న స్వామి ఆనంద్ గిరి (37) సన్యాసి జీవితానికి దూరంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. ఆత్మహత్య చేసుకున్న నరేంద్రగిరి శిష్యుడైన ఆనందగిరికి 86,000 మంది ఫాలోవర్స్ తో ఫేస్ బుక్ పేజీ ఉన్న యోగి అని వెల్లడైంది. లైవ్ స్ట్రీమ్ ల ద్వారా క్రమం తప్పకుండా భక్తులకు చేరువ అవుతున్నాడని తేలింది. 

సాధువు ఆనంద్ గిరి బ్రిస్బేన్, పారిస్, బెర్లిన్, ఆక్లాండ్, లండన్ పర్యటనల వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టారు. ఆనంద్ గిరి స్కైడైవింగ్, రివర్ రాఫ్టింగ్ చేసిన వీడియోలు కూడా ఫేస్ బుక్ పేజీలో దర్శనమిచ్చాయి. ఈఫిల్ టవరు కింద ఆనందగిరి నిలబడి ఉన్న చిత్రాలు కూడా ఉన్నాయి. యోగి అయిన అనందగిరి సూపర్ కార్లు, లగ్జరీ బైక్ లలో తిరిగారనడానికి వాటి పక్కన ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.ఆనందగిరి వాణిజ్య విమానంలోని బిజినెస్ క్లాస్ సెక్షన్ లో మద్యం గ్లాసు పక్కన కూర్చున్న చిత్రం కూడా వెలుగుచూసింది. 

దీంతో పాటు విమానంలోనుంచి స్కైడైవింగ్ చేసిన వీడియో కూడా వెలుగుచూసింది. ఆనందగిరిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.  ఒక మహిళతో తన ఫొటోను మార్ఫింగ్ చేసి సర్కులేట్ చేసి తన ఇమేజ్ ను దెబ్బతీస్తాడనే భయంతో నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

 తన గురువైన నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, తన గురువుపై కుట్ర జరిగిందని ఆనందగిరి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఆనందగిరిపై ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం కేసు నమోదు చేసి అతన్ని ప్రయాగరాజ్ లోని జిల్లా కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడికి పంపించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement