Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనంత క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి

ఎస్కేయూ వీసీ

బుక్కపట్నం, డిసెంబరు 2: జిల్లాలోని  డిగ్రీ కళాశాలల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాపోటీల్లో రాణించాలని ఎ స్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బుక్కపట్నం సత్యసాయి డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన జిల్లాస్థాయి పురుషుల హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌ పోటీలను ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా వీసీ మా ట్లాడుతూ... ఎస్కేయూ పరిధిలోని 20 డిగ్రీ కళాశాలల విద్యార్థుల్లో ఎంతో ప్రతి భ దాగి ఉందన్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. మరింత మెరుగైన ప్ర దర్శనతో జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతకుముందు వీసీకి కళాశాల ప్రి న్సిపాల్‌ లక్ష్మయ్య, అధ్యాపకులు, టోర్నీ నిర్వాహకుడు వెంకటేశనాయక్‌, విద్యార్థులు ఘనస్వాగతం పలికా రు. కార్యక్రమంలో ఎస్కేయూ వ్యాయామ విభాగాని కి చెందిన ఎస్సీ డైట్‌ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, ఎంఈఓ గోపాల్‌నాయక్‌, జడ్పీటీసీ శ్రీలత, గ్రామసర్పంచ నాగలక్ష్మీరాజు పాల్గొన్నారు.


మొదటిరోజు విజేతలు వీరే..

గురువారం నిర్వహించిన వాలీబాల్‌ పోటీల్లో హిం దూపురానికి చెందిన సప్తగిరి డిగ్రీ కళాశాల, అనంతపురంకు చెందిన వాణిడిగ్రీ కళాశాల, ఎస్‌డీడీఎస్‌ డిగ్రీకళాశాల,  గుంతకల్లుకు చెందిన ఎస్‌కేసీ డిగ్రీ కళాశాల, పుట్టపర్తికి చెందిన మంగళకర డిగ్రీ కళాశాల గెలుపొందాయి. హ్యాండ్‌బాల్‌ పోటీల్లో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల, ధర్మవరానికి చెందిన శ్రీనివాస డిగ్రీ కళాశాల జట్లు గెలుపొంది, ఫైనల్‌కు చేరుకున్నాయి.


Advertisement
Advertisement