ఏరోస్పేస్‌ పార్క్‌లో ఎస్‌కేఎం టెక్‌ యూనిట్‌

ABN , First Publish Date - 2022-05-22T06:58:16+05:30 IST

ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో విడి భాగాలను తయారు చేస్తున్న ఎస్‌కేఎం టెక్నాలజీస్‌ ఆదిభట్లలోని ఏరోస్పేస్‌ పార్క్‌లో రూ.45 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

ఏరోస్పేస్‌ పార్క్‌లో ఎస్‌కేఎం టెక్‌ యూనిట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో విడి భాగాలను తయారు చేస్తున్న ఎస్‌కేఎం టెక్నాలజీస్‌ ఆదిభట్లలోని ఏరోస్పేస్‌ పార్క్‌లో రూ.45 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాన్ని అభివృద్ధి చేసినట్లు ఎస్‌కేఎం టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సరిత రాతిబండ్ల తెలిపారు. ప్రెసిషన్‌ పరికరాలు, అసెంబ్లీ్‌సను కంపెనీ ఉత్పత్తి చేసి దేశ, విదేశాల్లోని కంపెనీలకు సరఫరా చేస్తోంది. డీఆర్‌డీఓ, బీడీఎల్‌, రాఫెల్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ, డసాల్ట్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ వంటి కంపెనీలు ఎస్‌కేఎం టెక్నాలజీస్‌ నుంచి విడి భాగాలను పొందుతున్నాయి. యూనిట్‌ విస్తరణకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్‌ రూ.30 కోట్లకు చేరుకోనుందని సరిత చెప్పారు. 

Updated Date - 2022-05-22T06:58:16+05:30 IST