ఎంఎస్‌పిపై ఐదుగురు సభ్యులతో ఎస్‌కేఎం కమిటీ

ABN , First Publish Date - 2021-12-04T23:29:07+05:30 IST

రైతు ఆందోళనలకు సంబంధించి భవిష్యత్ కార్యచరణపై చర్చిచేందుకు సింఘూ సరిహద్దులో...

ఎంఎస్‌పిపై ఐదుగురు సభ్యులతో ఎస్‌కేఎం కమిటీ

న్యూఢిల్లీ: రైతు ఆందోళనలకు సంబంధించి భవిష్యత్ కార్యచరణపై చర్చిచేందుకు సింఘూ సరిహద్దులో శనివారం జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సమావేశం సాయంత్రం 5 గంటల సమయంలో ముగిసింది. కనీస మద్దతు ధరపై (ఎంఎస్‌పీ) ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. రైతు నేతలు బల్బీర్ సింగ్ రజెవాల్, అశోక్ ధోలె, శివకుమార్ కక్కా, గుర్మం సింగ్ చౌదుని, యుధ్వీర్ సింగ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీలో బీకేయూ నేత రాకేష్ టికాయత్ పేరు చోటుచేసుకోలేదు. ఈనెల 7న ఎస్‌కేఎం మరోసారి సమావేశం కానుంది.


దీనికి ముందు, టికాయత్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంతో చర్చలను ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి లాంఛనంగా ఎలాంటి పిలుపు రానప్పటికీ ఎంసీపీపై ఏర్పాటు చేసే ఐదుగురు సభ్యుల కమిటీ పేర్లను కేంద్రానికి పంపే విషయంపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పలువురు రైతు నేతలు శుక్రవారంనాడు తెలిపారు. ఎంఎస్‌పీ, ఇతర అంశాలపై చర్చించేందుకు ఎస్‌కేఎం ఐదుగురు పేర్లు సూచించాలని కేంద్రం గత మంగళవారంనాడు పేర్కొంది. అయితే, ఈ అంశంపై కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్ కానీ, సమాచారం కూడా లేదని ఎస్‌కేఎం ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2021-12-04T23:29:07+05:30 IST