బాలలను పనిలో పెడితే చర్యలు

ABN , First Publish Date - 2020-10-30T11:25:24+05:30 IST

బాలలను పనుల్లో పెడితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

బాలలను పనిలో పెడితే చర్యలు

పలాస, అక్టోబరు 29: బాలలను పనుల్లో పెడితే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాశీబుగ్గ సబ్‌డివిజన్‌ పరిధిలో 59 మంది బాలకార్మికులను గుర్తించినట్లు చెప్పారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి బాలలతో పని చేయిస్తున్న సంస్థలపై దాడులు చేశామన్నారు. సంబంధిత తల్లి దండ్రులు, సంస్థల యజమానులకు కౌన్సెలింగ్‌ నిర్వహించామని పేర్కొన్నారు. సమావేశంలో కాశీబుగ్గ ఎస్‌ఐ మధుసూధనరావు, కార్మిక శాఖాధికారి విజయ్‌కుమార్‌, చైల్డ్‌లైన్‌ సిబ్బంది జనార్దనరావు ఉన్నారు. కాగా జంట పట్టణాల్లో పాలకేంద్రాలు, జీడి, ఇతర ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తున్న నలుగురు బాల కార్మికులను గురువారం గుర్తించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బాలకార్మికులతో పనిచేయిస్తున్న సంస్థలపై దాడులు నిర్వహించారు.  సంబంధిత పరిశ్రమల నిర్వాహకులను పోలీస్‌స్టేషన్‌లో సీఐ జి.శ్రీ నివాసరావు కౌన్సెలింగ్‌ నిర్వహించి బాలలను తల్లిదండ్రులకు అప్పగించారు. చైల్డ్‌టైన్‌ సిబ్బంది ఎం.మాధవరావు, జనార్దనరావు, సిబ్బంది పాల్గొన్నారు.


అనాథ బాలలకు అండగా పోలీస్‌: పాలకొండ డీఎస్పీ శ్రీలత

రాజాం రూరల్‌: బతుకు భారమై ఉపాధి కోసం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వీధి బాలలకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని పాలకొండ డీఎస్పీ శ్రీలత పేర్కొన్నారు. దీనికోసమే ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గురువారం దేవి శ్రీదేవి కల్యాణ మండపంలో రాజాం రూరల్‌ సీఐ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో 35 మంది బాల కార్మికులను గుర్తించామని, వీరికి మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దాతలు ముందుకు వచ్చి వీధి బాలల బంగారు భవితకు సహకరించాలన్నారు. పాలకొండ డివిజన్‌లో అనాఽథ బాలలను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేకంగా పోలీస్‌ రెస్క్యూ టీమ్‌లను నియ మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రేవతి, టౌన్‌, రూరల్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

బాలలతో పనిచేయించడం నేరం

హిరమండలం: బాలలతో పనిచేయించడం చట్టరీత్యా నేరమని పాతపట్నం సీఐ రవిప్రసాద్‌ అన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా గురువారం వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న ఇద్దరు బాలలను గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తీసు కువచ్చారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు, పని చేయించే వ్యాపారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మధుసూదనరావు, లేబర్‌ ఆఫీసర్‌ జయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


బాలలను పనిలో పెడితే చర్యలు

అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పాతపట్నం సీఐ రవిప్రసాద్‌ అన్నారు. గురువారం పోలీస్‌ స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ.. దేవాలయాల్లో తరుచూ దొంగతనాలు, విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలు జరుగుతున్నందున దేవాలయాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఆలయం మూసే సమయంలో ఆభ రణాలు ఇంటికి తీసుకువెళ్లాలని సూచించారు. ఆయనతో పాటు ఎస్‌ఐ మధుసూదనరావు ఉన్నారు.

Updated Date - 2020-10-30T11:25:24+05:30 IST