‘నాడు-నేడు’తో మౌలిక వసతులు

ABN , First Publish Date - 2020-10-29T08:52:32+05:30 IST

నాడు-నేడు పథకం ద్వారా విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామ ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

‘నాడు-నేడు’తో మౌలిక వసతులు

  స్పీకర్‌ తమ్మినేని సీతారాం   


పొందూరు, అక్టోబరు 28: నాడు-నేడు పథకం ద్వారా విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామ ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. బుధవారం కింతలి  పీహెచ్‌సీలో రూ.64లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు  శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వాలే మనుగడ సాధిస్తాయన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు మోసం చేయడం వల్ల ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. స్పీకర్లు మాట్లాడకూడదు, సభ ల్లో పాల్గొనకూడదని టీడీపీ నాయకులు చెబుతున్నారన్నారు.  స్పీకర్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకూడదా అని న్రశ్నించారు.  కింతలి పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధిచేసేందుకు  ప్రతిపాదనలు సిద్ధ్దమవుతున్నాయని చెప్పారు.  రూ.57 వేల కోట్లతో రాష్ట్రంలో జలజీవన్‌ పథకం ద్వారా ప్రతి గ్రామానికి తాగు నీరందిస్తామన్నారు.


కింతలిలో రూ.63లక్షలతో ఇంటింటా కుళాయిలు వేసేందుకు నిధులు మంజూరయ్యా యని చెప్పారు. అనంతరం కింతలి జడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నాయక్‌, వైసీపీ మండలాధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పప్పల రమణమూర్తి, సువ్వారి గాంధీ, లోలుగు కాంతారావు, బాడాన సునీల్‌, కొంచాడ గిరిబాబు, జె.వెంకటరావు, గార రమణ, సూర్యారావు కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T08:52:32+05:30 IST