Abn logo
Oct 2 2020 @ 03:39AM

స్వీట్‌ షాపులో మంటలు.. తప్పిన ప్రమాదం

పలాస: కాశీబుగ్గలోని కేటీరోడ్డు పాతబస్టాండ్‌ ఆవరణలోని జగదాంబ స్వీట్‌ షాపులో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కరోనా నేపథ్యంలో షాపు కొద్దిరోజులుగా మూతపడిన విషయం విదితమే. దీంతో మంటలు చెలరేగిన సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో దుకాణంలోని బీరువాలు, గ్యాస్‌స్టౌవ్‌, రిప్రిజరేటర్‌లు ఆహుత య్యాయి.


మందస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో రూ.30వేలు విలువైన వస్తువులు కాలిపోయినట్లు అంచనావేస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమా దానికి గల కారణాలు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement