‘నాడు-నేడు’ పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2020-10-02T09:08:17+05:30 IST

నాడు-నేడు పనుల్లో అవకతవక లకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ నివాస్‌ హెచ్చరించారు. జి.సి గడాం మండలం పెంట, జగన్నాథవలస, ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట, ఎస్‌ఎం పురం గురుకుల, రాజాం మండలం పొగిరి పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్‌ గురువారం పరిశీలించారు.

‘నాడు-నేడు’ పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు

 పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి ఫ కలెక్టర్‌ నివాస్‌

జి.సిగడాం/ఎచ్చెర్ల/రాజాం, అక్టోబరు 1: నాడు-నేడు పనుల్లో అవకతవక లకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ నివాస్‌ హెచ్చరించారు. జి.సి గడాం మండలం పెంట, జగన్నాథవలస, ఎచ్చెర్ల మండలం  కేశవరావుపేట, ఎస్‌ఎం పురం గురుకుల, రాజాం మండలం పొగిరి  పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్‌ గురువారం పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు. నాణ్యతకు తీలోదకాలు ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


బిల్లుల విషయంలో ఎవరు భయపడావాల్సిన అవసరం లేదని, పనులు పూర్తి చేసిన వారికి వారంలో చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.  పాఠశాలలు త్వరలో ప్రారంభమవుతాయని 15 రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆశయాలను నీరుగార్చకుండా పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు పాటుపడాలన్నారు.


పాఠశాల లను సుందరంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందన్నారు. బడిఈడు, బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయు లపై ఉందన్నారు.  ఉపాధ్యాయులు విధిగా పాఠశాలలకు హాజరు కావాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.  కార్యక్రమంలో  జి.సిగడాం, ఎచ్చెర్ల, రాజాం ఎంఈవోలు రవి, కారు పున్నయ్య, బి.రవి, ఇంజినీరింగ్‌ అధికారులు, హెచ్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2020-10-02T09:08:17+05:30 IST