పీజీ ఈ-సెట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-29T11:55:12+05:30 IST

బీఈ, బీటెక్‌ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఎమ్‌టెక్‌ కోర్సులో ప్రవేశించేందుకుగానూ ఏపీ పీజీ ఈ-సెట్‌ సోమవారం ప్రారంభమైంది. ఎచ్చెర్ల వేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంగా మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

పీజీ ఈ-సెట్‌ ప్రారంభం

ఎచ్చెర్ల, సెప్టెంబరు 28: బీఈ, బీటెక్‌ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఎమ్‌టెక్‌ కోర్సులో ప్రవేశించేందుకుగానూ ఏపీ పీజీ ఈ-సెట్‌ సోమవారం ప్రారంభమైంది. ఎచ్చెర్ల  వేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంగా మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.


తొలిరోజు ఉదయం జియో ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు. మధ్యాహ్నం కంప్యూటర్‌ సైన్స్‌ పరీక్షకు 72 మందికి 50 మంది హాజరయ్యారు. పరీక్షకు ప్రత్యేక పరిశీలకునిగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య, చీఫ్‌ సూపరింటెండెంట్‌గా జామి జనార్దనరావు వ్యవహరించారు. 

Updated Date - 2020-09-29T11:55:12+05:30 IST